Naga Chaitanya, Sobhita: ఆ రాష్ట్రంలో చైతన్య శోభిత పెళ్లి.. పెళ్లి వేదిక ఫిక్స్ అయినట్లేనా?

నాగచైతన్య (Naga Chaitanya) శోభిత  (Sobhita Dhulipala) నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ జోడీకి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట వైరల్ అవుతోంది. చైతన్య శోభిత జోడీ క్యూట్ జోడీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే చైతన్య శోభిత పెళ్లి ఈ ఏడాది డిసెంబర్ నెలలో లేదా 2025 మార్చి నెలలో జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఈ పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తోంది. పెళ్లి వేదిక కూడా దాదాపుగా ఫిక్స్ అయినట్లేనని త్వరలో వివరాలను అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం అందుతోంది.

Naga Chaitanya, Sobhita

చైతన్య శోభిత పెళ్లి కోసం మరో ఆరు నెలలు మాకు ఎదురుచూపులు తప్పవా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చైతన్య శోభిత కలకాలం సంతోషంగా, అన్యోన్యంగా ఉండాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అటు చైతన్య ఇటు శోభిత కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. చైతన్య శోభిత సినిమాల షెడ్యూల్స్ కు అనుగుణంగా పెళ్లి తేదీని ఫిక్స్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

ఈ నెల 8వ తేదీన చైతన్య శోభిత నిశ్చితార్థం జరగగా నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. నాగచైతన్య ప్రస్తుతం తండేల్  (Thandel)  సినిమాకు పూర్తిస్థాయిలో పరిమితమయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో తండేల్ ఒకటి. సాయిపల్లవి  (Sai Pallavi)  ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

కార్తికేయ2 (Karthikeya 2) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చందూ మొండేటి  (Chandoo Mondeti)  ఈ సినిమాతో కూడా అదే తరహా ఫలితాన్ని రిపీట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న తండేల్ సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి స్పష్టత రానుంది.

బన్నీ మరీ సాఫ్ట్ టార్గెట్ ల తయారయ్యాడా లేక నిజంగానే ట్రోల్ చేస్తున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus