Allu Arjun: బన్నీ మరీ సాఫ్ట్ టార్గెట్ ల తయారయ్యాడా లేక నిజంగానే ట్రోల్ చేస్తున్నారా?

  • August 22, 2024 / 04:01 PM IST

సోషల్ మీడియా కాలంలో ట్రోల్ అవ్వడం అనేది చాలా మామూలు విషయం. చెడుకి ట్రోల్, మంచికి ట్రోల్. కాదేదీ ట్రోలింగ్ కి అనర్హం అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి. ఆ ట్రోలింగ్ హెల్తీగా ఉన్నంతవరకు పర్వాలేదు కానీ శృతి మించితేనే తీసుకోవడం కష్టం. చిరంజీవి (Chiranjeevi) స్పీచులను, ఆయన వ్యక్తుల పేర్లు తప్పుగా పలకడాన్ని కూడా ట్రోల్ చేస్తారు. ఆ విషయాన్ని ఆయన కూడా హుందాగా తీసుకుంటారు. అలాగే.. బాలయ్య మాస్ స్పీచులు కూడా ట్రోల్ అవుతాయి, ఆ విషయం బాలయ్యకు కూడా తెలుసు, ఆయన కూడా సరదాగా తీసుకుంటాడు.

Allu Arjun

ఇవన్నీ సరదా ట్రోలింగులు, ఎవరినీ నొప్పించని ట్రోలింగులు. కానీ.. ఒక్క అల్లు అర్జున్  (Allu Arjun)  విషయంలోనే మనసును నొప్పించే విధంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ మనస్ఫూర్తిగా నవ్వడాన్ని పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మార్చేయడంతో “ఆర్య” ఈవెంట్లో బన్నీ చెయ్యి అడ్డుపెట్టుకొని నవ్వడాన్ని చూసి చాలా మంది బాధపడ్డారు. ఒక మనిషికి హాయిగా నవ్వే స్వాతంత్ర్యం కూడా లేకుండా చేసిన సోషల్ మీడియా అంటే కొంతమేరకు వెగటు పుట్టింది.

ఇక నిన్న “మారుతీ నగర్ సుబ్రమణ్యం” (Maruthi Nagar Subramanyam) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన బన్నీ “హీరోని చూసి అందరూ ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యాను” అన్న ఒక్క మాటను పట్టుకుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పైపెచ్చు.. ఇవాళ ఇంద్ర  (Indra)  రీరిలీజ్ థియేటర్లలో శివాజీ  (Sivaji) పీటల మీద నుండి లేచి వెళ్ళిపోయేప్పుడు బన్నీ అని కావాలని అరవడం ఏ విధంగానూ సమంజసం కాదు.

అల్లు అర్జున్ మాట్లాడిన మాటను ఏదో ట్రోల్ చేయాలి అని కాకుండా.. తన అభిమానుల కోసం తాపత్రయపడే హీరోలా కూడా చూడొచ్చు. తన అభిమానుల పలకరిస్తున్న ఆనందంలో మీకోసమే నేను హీరో అయ్యాను అనే అర్థం వచ్చేలానే ఫ్యాన్స్ కోసం హీరో అయ్యాను అన్నాడు బన్నీ. దాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ట్రోల్ చేసేంత తప్పు ఏం అన్నాడనేది ట్రోల్ చేసేవాళ్లు ఆలోచించుకోవాల్సిన విషయం.

వ్యంగ్యం అనేది హుందాగా ఉండాలి కానీ.. ఈసడించుకునేలా కాదు. ఈ తారతమ్యాలను కొందరు ట్విట్టర్ యువత ఎప్పుడో మర్చిపోయారు అనుకోండి. ఇదేదో బన్నీ & టీమ్ మెప్పు పొందడం కోసం వ్యక్తపరుస్తున్న అభిప్రాయం కాదు, తెలుగు సినిమాకి “బెస్ట్ యాక్టర్” కేటగిరీలో మొట్టమొదటి నేషనల్ అవార్డ్ తీసుకొచ్చిన నటుడిని అంతలా అనవసరమైన మాటలు అనడం సమంజసం కాదనే దృక్పథంతో వెలిబుచ్చిన అభిప్రాయం.

ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలి.. బన్నీ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus