Nagarjuna, Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాగార్జున మధ్య ఇంత అనుబంధం ఉందా?

సినీ హీరోల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంటుంది అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎంతోమంది హీరోలు తమ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని పలు సందర్భాలలో బయటపెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా నాగార్జున పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం కూడా బయటపడింది మామూలుగా నాగార్జున పవన్ కళ్యాణ్ ఇద్దరు బయట ఎక్కడ కలిసి కనిపించిన సందర్భాలు లేవనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి బయట కనిపించడం చాలా అరుదు అలాంటిది వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని తాజాగా ఈ సంఘటన తెలియజేస్తుంది.

పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వైజాగ్ హార్బర్ లో ఇటీవల జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా కొంతమంది మత్స్యకారుల బోటులు పూర్తిగా దగ్ధమైపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మత్సకారులను పలకరించడం కోసం పవన్ కళ్యాణ్ వైజాగ్ హార్బర్ వెళ్లారు. నష్టపోయిన వారికి ఈయన ఆర్థికంగా సహాయం అందజేశారు.

అయితే అక్కడికి వెళ్లడానికి పవన్ కళ్యాణ్ వెళ్లవలసిన ఫ్లైట్ మిస్ కావడంతో మరొక ఫ్లైట్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే అందుకు చాలా సమయం పడుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెంటనే నాగార్జునకు ఫోన్ చేసి తన ప్రైవేట్ జెట్ పంపించాలని కోరారు. ఇలా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అడగడంతో నాగార్జున ఏమాత్రం ఆలోచించకుండా తన ప్రత్యేక విమానం పవన్ కళ్యాణ్ కోసం పంపించారు నాగార్జున (Nagarjuna) సాధారణంగా ఈ విమానం ఎవరికోసం ఉపయోగించరు.

తన కొడుకులకు తప్ప మిగతా ఎవరికి కూడా ఈ ఫ్లైట్ ఇవ్వరనే సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున ఫ్లైట్ పంపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరి మధ్య ఇంత మంచి అనుబంధం ఉందా అసలు బయటపడరు కదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రైవేట్ జట్ ఖరీదు కూడా తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ జెట్ కోసం సుమారు 6 నుంచి ఏడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus