ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ కింగ్ నాగార్జున!

ఒకప్పుడు ఇండస్ట్రీ లో చిరు, బాలయ్య, నాగ్, వెంకీ ల మధ్య హోరా హోరీ పోటీ ఉండేది.కాక పోతే మెగా స్టార్ చిరంజీవి రాజకీయాలలో బిజీ గ ఉండటం వల్ల ఈ సారి పోటీ లో లేడు. తాజాగా ఈ సంక్రంతి కి విడుదలైన సినీమాల మధ్య గట్టి పోటీనే జరిగింది.కెరీర్ లో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ఈ సారి నాగార్జున సంక్రాంతిని తన కైవసం చేసుకున్నాడు.ముఖ్యంగా బాలయ్య కు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య  ఈ సారి గట్టి పోటీ ఉంటుంది అని అందరు అనుకొన్నారు.కాని నాగార్జున అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంక్రాంతి కింగ్ గా నిలిచినా విషయం మనకు తెలిసిందే.
 అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన ‘మనం’ సినిమా కెరీర్ లో ఎప్పుడు లేనటువంటి విధంగా కలెక్షన్స్ ని సాధించి నాగార్జున కెరీర్ లో టాప్ మూవీ గా నిలిచిపోయింది.అదే రికార్డు ను ఈ సారి సంక్రాంతి కి దాటేసాడు నాగార్జున.ఎ హీరో కి సాధ్యం కానటువంటి రీతిలో 50 కోట్ల పైచిలుకు కలెక్షన్స్  ని సాధించి టాలీవుడ్ బాక్స్ ఆఫీసు ని కొల్లగొట్టాడు.అటు బాలయ్య, ఎన్టీఆర్  సినిమాలు కూడా బాగానే కలెక్షన్స్ ని సాదించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా ముందు ఈ రెండు సినిమాలు తేలిపోయాయి అని చెప్పొచు.50 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ ని సాధించిన కింగ్ నాగర్జుననే టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ అని ఇండస్ట్రీ లోని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus