#NBK108 లో శ్రీలీల… బాలకృష్ణ కూతురు కాదట.. ట్విస్ట్‌ ఇదే అంటున్నారు!

సినిమాల్లో ట్విస్ట్‌లు కామన్‌.. అప్పటివరకు జరిగింది అంతా నిజం అనుకుని, చూపించింది అంతా సత్యం అనుకుని, వినింది అంతా కరెక్ట్‌ అనుకుంటుంటే.. కాదు కాదు అసలు విషయం ఇది కాదు అని అంటుంటారు మన సినిమా దర్శకులు. అసలు కథ వేరే ఉంది, ఇప్పటివరకు పాత్రలు ఓ కారణంతో అలా చేశారు అని చెప్పిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? దసరాకు రాబోయే ఓ సినిమాలో ఇదే ఫార్ములా వాడతారు అని తెలుస్తోంది. ఆ సినిమానే #NBK108. అవును బాలయ్య సినిమాలోనే.

బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. దానికి #NBK108 అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. ఇటీవల ఈ సినిమా లుక్స్‌ కూడా విడుదల చేశారు. అంతేకాదు చాలా రోజుల క్రితం ఈ సినిమా ఆలోచన చెప్పినప్పుడు దర్శకుడు అనిల్‌ రావిపూడి సినిమాలోని అసలు విషయం చెప్పేశారు. సినిమాలో మెయిన్‌ థీమ్‌ ఏంటి, ప్రధాన నటుల పాత్ర చిత్రణ ఏంటి అనే వివరాలు చెప్పేశారు. అయితే అప్పుడు అలా ఎందుకు చెప్పారు అనే విషయంలో క్లారిటీ లేదు.

అయితే ఇప్పుడు కొంత క్లారిటీ వస్తోంది అని చెప్పొచ్చు. కాజల్‌, శ్రీలీల, అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు కుమార్తెగా శ్రీలీల నటిస్తోంది అని అప్పుడే చెప్పారు. అయితే వారిద్దరూ తండ్రీకూతుళ్లు కాదు అనేది లేటెస్ట్‌ టాక్‌. అంతేకాదు ఇదే సినిమాలో కీలకమైన విషయం అని కూడా చెబుతున్నారు. అంటే సినిమా చాలా వరకు ఇద్దరూ తండ్రీకూతుళ్లు అని చెప్పినా.. క్లైమాక్స్‌లో అసలు విషయం చెబుతారు అని అంటున్నారు.

శ్రీలీల తండ్రి పాత్రలో సినిమాలో కనిపించబోయేది శరత్ కుమార్ అట. ఈ సినిమాలో బాలకృష్ణకు అన్నయ్యగా ఆయన నటిస్తున్నారు అని సమాచారం. అంటే అన్న కూతురిని తన కూతురుగా బాలయ్య పెంచుతాడట. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది సినిమాలో కీలకమైన పాయింట్‌ అని అంటున్నారు. ‘విజయ దశమికి ఆయుధ పూజ’ అంటూ దసరా బరిలో సినిమాను  నిలిపినట్లు ఇటీవల చెప్పారు. కాబట్టి ఆ రోజు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus