గత రెండు రోజులుగా ఓ ట్విటర్ పేజీని తెగ రిఫ్రెష్ చేస్తున్నారు టాలీవుడ్ సినీ అభిమానులు. ఎప్పుడూ అభిమానులతో ఇంటరాక్టివ్‌గా ఉండే ఆ పేజీలో ఏమైనా కొత్త పోస్టు పడుతుందా, మాకేమైనా క్లారిటీ వస్తుందా అనేది వాళ్ల ఆశ. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది. ఆ సినిమా ‘ఓజీ’ అని, ఆ ట్విటర్ పేజీ ‘డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్’ అని. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవాళ్లకు ఈ పాటికి వార్త ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చేసుంటుంది.
పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’ సినిమా చేతులు మారింది అనేది లేటెస్ట్ పుకారు. సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ స్ట్రీమ్ సినిమా వెబ్‌సైట్లు కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా రాసుకొస్తున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ నుండి భారీ మొత్తానికి ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది అనేది ఆ పుకార్ల సారాంశం. పవన్ పొలిటికల్ పనులు అయ్యేటప్పటికి చాలా సమయం పడుతుందని, అంతవకు వెయిట్ చేయడం ఇష్టం లేక దానయ్య సినిమాను అమ్మేశారు అని అంటున్నారు.
దీంతో ఈ విషయంలో వాళ్ల ట్విటర్ పేజీ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో అని ఆ పేజీ మీద పడ్డారు ఫ్యాన్స్. మామూలుగా అయితే ‘ఓజీ’ సినిమాకొచ్చిన హైప్ ప్రకారం ఎవరూ వదులుకోరు. ఎందుకంటే ఈ సినిమా వస్తే ఇండస్ట్రీ రికార్డులు బద్దలవ్వడం ఖాయం అని ఇప్పటికే నమ్మకంగా ఉన్నారు. ఇలాంటప్పుడు ఎందుకు అమ్ముకుంటారు అనేది ప్రశ్న. అయితే గతంలో ప్రభాస్ – మారుతి సినిమాను దానయ్య వదిలేసుకున్నారు. ఆ లెక్కన ఇది కూడా వదిలేస్తారు అని కొంతమంది నమ్ముతారు.
మరి దానయ్య నిజంగానే ‘ఓజీ’ (OG Movie) వదిలేస్తున్నారా? ఆ సినిమా విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నారా అనేది చూడాలి. ఒకవేళ వదులుకుంటే మాత్రం దానయ్య వరుసగా మూడో సినిమా ఓకే అనుకుని, ముందుకెళ్లి ఆగిపోయినట్లే. చిరంజీవి, వెంకీ కుడుముల సినిమా కూడా ఇలానే అనౌన్స్ చేసి ఆగిపోయిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!