Pawan Kalyan: పవన్‌ బిజీ లైనప్‌ మారుతోందా..!

పవన్‌ కల్యాణ్‌ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ఇవి కాకుండా మరో సినిమాలు అనౌన్స్‌ అయ్యాయి. ఆ రెండూ కాకుండా మరో ఇద్దరు నిర్మాతలు కథలు వెతుకుతూ, దర్శకులు సెట్‌ చేసుకుంటున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక లైనప్‌ అనౌన్స్‌ కాలేదు. అయితే ఈ అనధికారిక లైనప్‌లో మార్పు ఉండబోతుందని వార్తలొస్తున్నాయి. ఈ మేరకు నిర్మాతల ద్వయం ఫోర్స్‌ చేస్తున్నారని టాక్‌. ప్రస్తుతం పవన్‌ ‘భీమ్లా నాయక్‌’ సినిమా చేస్తుండగా, ‘హరి హర వీరమల్లు’ సెట్స్‌పై హోల్డ్‌లో ఉంది.

‘భీమ్లా..’ అయ్యాక క్రిష్ ‘హరి హర..’ స్టార్ట్‌ చేసి వీలైనంత త్వరగా ఫినిష్‌ చేస్తారు. ఈ రెండు తర్వాత హరీష్ శంకర్‌ ‘భవదీయుడు భగత్ సింగ్‌’ సినిమా చేయాల్సి ఉంది. దీని తర్వాతే మిగిలిన సినిమాలు అని గతంలో అనధికారికంగా వార్తలొచ్చాయి. వాటిలో సురేందర్‌ రెడ్డి – రామ్‌ తాళ్లూరి సినిమా ఒకటి, మరొకటి భగవాన్‌ – పుల్లారావు నిర్మాణంలో సినిమా. ఇవన్నీ కాకుండా దిల్‌ రాజుకు ఓ సినిమా చేస్తారనే మాటలూ వినిపించాయి. ఇందులో భగవాన్‌ – పుల్లారావు సినిమా విషయంలోనే ఇప్పుడు మార్పు ఉంటుందని టాక్‌.

ఆ నిర్మాతల దగ్గర పవన్‌ చాలా రోజుల క్రితమే అడ్వాన్స్ తీసుకున్నారట. అయితే కరోనా, ఇతర కారణాల కారణంగా సినిమాలు వాయిదా పడుతూ, పడుతూ ఈ సినిమా కూడా లేట్‌ అయ్యింది. అయితే ఇప్పుడు తమకు త్వరగా సినిమా చేయాలని వాళ్లు అడుగుతున్నారట. దాని కోసం కొత్త దర్శకుడిని, కథను కూడా సిద్ధం చేశామని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు లైనప్‌లో పవన్‌ మార్పులు చేస్తారంటున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus