ముంబయిలో సెటిల్‌ అవ్వాలని ఫిక్స్‌ అయ్యిందా?

అప్పుడెప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ‘మాస్క్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలకరించింది పూజా హెగ్డే. తొలి సినిమాతో ఫర్వాలేదనిపించినా తర్వాత రెండేళ్ల వరకు మళ్లీ అవకాశాలు దక్కలేదు. 2014లో ‘ఒక లైలా కోసం’తో మరోసారి వచ్చింది. మళ్లీ అదే పరిస్థితి. అయితే 2017లో ‘దువ్వాడ జగన్నాథం’తో రీఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుండి ఈ మేడమ్‌ జోరు మామూలుగా లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ పోతోంది. తెలుగు, హిందీని బ్యాలెన్స్‌ చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే ఆమె ఫస్ట్‌ ఇంపార్టెన్స్‌ బాలీవుడేనా.. ఏమో ఆమె పనులు చూస్తుంటే అదే అనిపిస్తోంది.

టాలీవుడ్‌లో పారితోషికం గట్టిగా తీసుకుంటున్న కథానాయికల్లో పూజా హెగ్డే మొదటి స్థానాల్లో ఉంటుంది. కుర్ర స్టార్లతో వరుసగా జట్టుకడుతోంది. మరోవైపు బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే స్టార్ల సరసన నటిస్తోంది. అయితే తాజాగా ఆమె ముంబయిలో ఓ ఇల్లు కొనుక్కుంటోంది అనేది తాజా వార్త. ముంబయిలో సీ వ్యూ ఉండేలా ఓ ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ తీసుకుందట. దీని కోసం ఈ అమ్మడు బాగానే ఖర్చు పెడుతోందట. దగ్గరుండి మరీ చూసుకొని… అభిరుచికి తగ్గట్టుగా ఇంటి ఇంటీరియర్‌ డెకరేషన్‌ని చూసుకుంటోందట.

ఇక్కడివరకు బాగుంది.. ఆమె ఇల్లు తీసుకోవడం అభిమానులకు ఆనందమే. అయితే టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తుంటే… ముంబయిలో ఇల్లు కొనుక్కోవడం ఏంటి అనేది నెటిజన్ల ప్రశ్న. దీనికి కూడా ఓ సమాధానం ఉంది. పూజ ఇటీవల తెలుగులో కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ సరసన నటించడం మినహా ఆమె చేతిలో టాలీవుడ్‌ సినిమా లేదు. అదే సమయంలో బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ ‘సర్కస్‌’, సల్మాన్‌ ఖాన్‌తో ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ సినిమాల్లో నటిస్తోంది. ఈ లెక్కన పూజా మళ్లీ టాలీవుడ్‌లో గ్యాప్‌ ఇవ్వాలని అనుకుంటోందా. అలా చేసి మళ్లీ రిస్క్‌ చేస్తోందా? ఎందుకంటే ‘ముకుంద’ తర్వాత ‘మొహంజొదారో’ కోసం ఇలానే టాలీవుడ్‌ విడిచి వెళ్లింది. బొక్కబోర్లా పడి తిరిగి వచ్చేసింది.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus