Prabhas: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి షాక్‌.. ఆ సినిమా ఇక రానట్లే!

ప్రభాస్‌ చేతిలో ఉన్న సినిమాలు, ఓకే చెప్పారు అని వినిపిస్తున్న సినిమాలు లెక్కపెట్టాలంటే చేతి వేళ్లు సరిపోతాయేమో అని అంటున్నారు టాలీవుడ్‌లో. సెట్స్‌ మీద రెండు సినిమాలు ఉండగా, పోస్ట్‌ ప్రొడక్షన్‌లో మరో సినిమా ఉంది. ప్రీ ప్రొడక్షన్‌లో మరో సినిమా ఉంది. ఇది తేలిన లెక్క.. ఇది కాకుండా తేలాల్సిన లెక్క ఇంకా ఉంది అంటున్నారు. వరుస సినిమా చేయాలని ఫిక్స్‌ అయిన ప్రభాస్. తన దగ్గరకు వచ్చిన కథల్ని ఇంకా వింటున్నాడు. అయితే ఈ సమయంలో ఓ నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్‌ను వెనక్కిచ్చేశాడు అని సమాచారం.

‘బాహుబలి’ సమయంలో అనుకుంటా.. ప్రభాస్‌ను డీవీవీ దానయ్య పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ ఇచ్చారు అని సమాచారం. పెద్ద దర్శకుడితో సినిమా చేయడానికి ఆ అడ్వాన్స్‌ అని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమా ఇంకా మొదలవ్వలేదు. ఆ మధ్య మారుతి సినిమా ఆ బ్యానర్‌లోనే ఉంటుంది అని అందరూ అనుకున్నారు. వార్తలు కూడా అలానే వచ్చాయి. అయితే ఏమైందో ఏమో.. ఆ సినిమా వేరే బ్యానర్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడే ప్రభాస్‌ – దానయ్య సినిమా ఉంటుందా, ఉండదా అంటూ చర్చ సాగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం… అయితే దానయ్య సినిమాను చేయలేనని ప్రభాస్‌ తేల్చేశారట. అంతేకాదు తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా వెనక్కి ఇచ్చేశారు అని చెబుతున్నారు. ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, మారుతి సినిమా తర్వాత ప్రభాస్‌ డేట్స్‌ అడ్జెస్ట్‌ అవుతాయని అనుకున్నారట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదట. ఈ సినిమాల తర్వాత బాలీవుడ్‌ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌తో యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో ఓ సినిమా చేయాలి. అదేం అంత త్వరగా అయ్యే సినిమా కాదు.

ఆ తర్వాత మళ్లీ ప్రశాంత్‌ నీల్ సినిమా ఉంది అని దిల్‌ రాజు ఇటీవల చెప్పారు. దీంతో అడ్వాన్స్‌ వెనక్కిచ్చేసి లెక్క సరి చేసుకోవాలని ప్రభాస్‌ అనుకున్నారట. దానయ్య నిర్మాణంలో చిరంజీవి సినిమా కూడా అనుకున్నా అదీ ఆగిపోయింది. అయితే పవన్‌ కల్యాణ్‌ – సుజీత్‌ సినిమా అనౌన్స్‌ అయ్యింది అనుకోండి. ఇదంతా చూస్తుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సినిమా తీసి.. ఆ తర్వాత సరైన సినిమాలు ఎందుకు ఓకే చేయించుకోలేకపోతున్నారో దానయ్య! అని సోషఫల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus