Prabhas: ప్రశాంత్‌ కోసం ప్రభాస్‌ ఆ రిస్క్‌ చేస్తాడా?

‘సలార్‌’ సినిమా షూటింగ్‌ మొదలైనప్పటి నుండి సినిమాపై ఏదో ఒకటి పుకారు వస్తూనే ఉంది. రీసెంట్‌గా వినిపించిన పుకారు అయితే ఇందులో ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపిస్తాడని. దీంతో అభిమాను ఆనందం రెట్టింపు అయిపోయింది. ఇప్పటివరకు ప్రభాస్‌ డ్యూయల్‌ రోల్‌ చేసింది ‘బిల్లా’,‘బాహుబలి’లో మాత్రమే అయితే… ఇద్దరు ప్రభాస్‌లు ఒకేసారి స్క్రీన్‌ మీద కనిపించింది లేదు. అయితే ‘సలార్‌’లో ఆ అవకాశం ఉందట. అంతేకాదు అందులో ఒక రోల్‌ ఓల్డేజ్‌ అట.

‘సలార్‌’ సినిమాలో ప్రభాష్‌ను.. డిఫరెంట్‌గా చూపించాలని ప్రశాంత్‌ నీల్‌ ట్రై చేస్తున్నాడు. ఆ మాటకొస్తే ప్రశాంత్‌ ఎప్పుడూ ఇంతే. ఈ క్రమంలో ప్రభాస్‌ను డ్యూయల్‌ రోల్‌ చేయించి, అందులోనూ ఓ పాత్రను ఓల్డేజ్‌లో చూపిస్తాడట. అలా కెరీర్‌లో తొలిసారి ప్రభాస్‌ ఓల్డేజ్‌ రోల్‌లో కనిపించబోతున్నాడన్నమాట. ‘బిల్లా’లో బిల్లా, రంగా రెండూ యంగ్‌ రోల్సే. ఇక ‘బాహుబలి’లోనూ అంతే. మహేంద్ర, అమరేంద్ర కుర్రాళ్లుగానే కనిపిస్తారు.

దీంతోపాటు ‘సలార్‌’కు సంబంధించి మరో పుకారు కూడా షికారు చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సోదరిగా రమ్యకృష్ణ నటిస్తోందని తెలుస్తోంది. సినిమాలో కీలక సమయంలో రమ్యకృష్ణ పాత్ర ఎంటర్‌ అవుతుందట. ఈ విషయంలోనూ ఎలాంటి స్పష్టత లేనప్పటికీ రూమర్‌ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘బాహుబలి’లో ప్రభాస్‌కు తల్లిగా కనిపించిన రమ్యకృష్ణ ఇప్పుడు సోదరిగా ఎలా చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus