Prabhas: ఎక్కువ సినిమాలకు ఓకే చెప్పి ప్రభాస్ తప్పు చేశారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ సినిమాల విషయంలో గందరగోళం నెలకొందనే సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ప్రస్తుతం ప్రాజెక్ట్ కే కూడా రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఫ్యాన్స్ కు ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తున్నా మరోవైపు టెన్షన్ పెడుతున్నాయి. ప్రభాస్ ప్లానింగ్ కరెక్టేనా అనే ప్రశ్నలు సైతం సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్ సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. ప్రాజెక్ట్ కే మూవీ వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు ప్రభాస్ సినిమాలు ఈ మధ్య కాలంలో చెప్పిన డేట్ కు విడుదల కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

2026 సంవత్సరం వరకు వరుస ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బిజీగా ఉండగా వరుస విజయాలను అందుకునే విధంగా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఎక్కువ సినిమాలకు ఓకే చెప్పి ప్రభాస్ తప్పు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకే సమయంలో ఎక్కువ సినిమాలలో నటిస్తే లుక్ పరంగా ప్రభాస్ పెద్దగా మార్పు చూపించలేరు. అదే సమయంలో ఏదైనా సినిమా కోసం ప్రభాస్ బరువు పెరిగినా తగ్గినా ఆ ప్రభావం ఇతర సినిమాలపై పడుతుంది.

ప్రభాస్ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కాగా బడ్జెట్ ఎక్కువ అవుతుండటంతో కొంతమంది నిర్మాతలు ప్రభాస్ తో రెండు భాగాలుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus