Bigg Boss 7 Telugu: ఇదెక్కడి న్యాయం బిగ్ బాస్ ? నాగార్జున చెప్పిన ఆ మాట వల్లే ఇలా అవుతోంది..!

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి వారం హౌస్ మేట్స్ ఓట్ అప్పీల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక టాస్క్ లో యావర్ గెలిచాడు. ఇంకో టాస్క్ లో శోభాశెట్టి గెలిచింది. ఇద్దరూ కూడా ఓట్ అప్పీల్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. అయితే, ఇక్కడ పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ మద్దతుతో ఒక్కరు మాత్రమే నేరుగా ప్రజలని ఓట్ అప్పీల్ చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో ఒక్కొక్కరు రీజన్స్ చెప్పడం ప్రారంభించారు. ముందుగా అర్జున్ శోభాకి మద్దతు ఇచ్చాడు.

అన్నింటిలోనూ చూస్తే యావర్ కంటే కూడా శోభాకే నీడ్ ఎక్కువగా ఉందని చెప్పాడు. కొన్ని టాస్క్ ల పరంగా నీకు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది, శోభాకి తక్కువగా ఉందని అన్నాడు. ఆ తర్వాత ప్రియాంక కూడా ఇదే మాట చెప్పింది. అంతేకాదు, యావర్ మళ్లీ టాస్క్ లు ఆడి ఈ పొజీషన్ లోకి వస్తాడు. కానీ, శోభాకి ఆ అవకాశం ఉండదేమో అని చెప్పింది. దీనికి శోభాశెట్టి హర్ట్ అయ్యింది. నేను నిజంగా టాస్క్ లు ఆడలేనా ? మళ్లీ ఇక్కడికి రాలేనా చెప్పు అంటూ నిలదీసింది.

దీంతో ప్రియాంక మాట మార్చింది. నా ఉద్దేశ్యం అది కాదంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది. మరోవైపు యావర్ కూడా ఇదే పాయింట్ పట్టుకుని నువ్వు చెప్పింది కరెక్ట్ కాదని చెప్పాడు. అంతేకాదు, నామినేషన్స్ పాయింట్ కూడా ఇక్కడకి తీస్కుని వచ్చాడు. దీంతో ఆర్గ్యూమెంట్ పెరిగింది. యావర్ ఇంకా ప్రియాంక ఇద్దరూ కూడా కాసేపు వాగ్వివాదం చెేసుకున్నారు. ఇక్కడ శోభాశెట్టికి డైరెక్ట్ గా ఫ్రెండ్ అని మద్దతు ఇవ్వచ్చుకదా, ఇలాంటి రీజన్ ఎందుకు చెప్పడం అంటూ ప్రియాంకని యావర్ నిలదీశాడు. నేను స్ట్రాంగ్ అంటే శోభా వీక్ అనే అర్దం వస్తుంది కదా అంటూ మాట్లాడాడు.

దీంతో ప్రియాంక బదులు చెప్పలేకపోయింది. అంతేకాదు, తను అన్నమాటలని చివరి వరకూ కూడా సమర్ధించుకుంది. నిజానికి అంతకముందు స్మిమ్మింగ్ పూల్ టాస్క్ లో ఫస్ట్ లోనే ఓడిపోయిన శోభాకి అర్జున్ అండగా ఉన్నాడు. కావాలంటే నేను తప్పుకుంటాను ఆ ప్లేస్ శోభాకి ఇమ్మని చెప్పి బిగ్ బాస్ ని రిక్వస్ట్ చేసుకున్నాడు. అందుకే, అర్జున్ శోభాకి మద్దతు ఇచ్చాడు. అంతేకాదు, ఓట్ అప్పీల్ చేసుకున్నా ఒకటే, చేసుకోపోయినా ఓకటే అనే థోరణికి వచ్చాడు అర్జున్. దీనికి నాగార్జున వీకెండ్ చెప్పిన మాటే కారణం అయ్యింది.

వీకండ్ నాగార్జున వెళ్లిపోతూ అర్జున్ బోటమ్ లో ఉన్నాడు. ఫినాలే టిక్కెట్ గెలవకపోతే తనే ఎలిమినేట్ అయ్యేవాడని క్లియర్ గా చెప్పేశాడు. దీంతో అర్జున్ కాన్ఫిడెన్స్ పోయింది. ఇప్పుడు ఓటు అడుక్కోవడం వల్ల టాప్ లోకి వెళ్లమనే అనుకున్నాడు. అంతేకాదు, బిగ్ బాస్ ఫినాలేలోకి అడుగు పెట్టాడు కాబట్టి ఈవారం అర్జున్ సేఫ్ అయిపోతాడు. అందుకే, చాలామంది అర్జున్ కి ఓట్ కూడా వేయడం లేదు. మరి ఫైనల్ వారం అయినా సరే ఓట్ వేస్తారా లేదా అనేది ఆసక్తికరం.

ఇక ఫైనల్ గా శోభాశెట్టి హౌస్ మేట్స్ మద్దతు సంపాదించి, ప్రేక్షకులని ఓట్ వేయమని అడిగింది. నేను కార్తీకదీపం మోనితగా మీకు అందరికీ తెలుసు. ఇక్కడి వరకూ నన్ను ఆదరించారు. ఇక నుంచీ కూడా ఓట్ వేసి ఆదరిస్తే ఫస్ట్ లేడీ బిగ్ బాస్ విన్నర్ అవుతానని చెప్పింది. మరి ప్రేక్షకులు శోభాశెట్టికి ఎలాంటి పొజీషన్ ఇస్తారు అనేది చూడాలి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus