స్టార్ డైరక్టర్ అయ్యాక, పాన్ ఇండియా సినిమాలు చేయడం ప్రారంభించాక ఎప్పుడూ చేయని చాలా పనులను ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు చేస్తున్నారు అని సమాచారం. తమ కొత్త సినిమా #SSRMB / #SSMB29కు సంబంధించి జరుగుతున్న పనులు రెగ్యులర్‌గా ఆయన చేసేవి కాకపోవడమే ఈ మాట బయటకు రావడానికి కారణం. ఈ సినిమా టైటిల్‌ను ఇప్పటివరకు చెప్పకుండా లాక్కుంటూ వచ్చిన రాజమౌళి అండ్ కో. నిన్న సాయంత్రం చెప్పకనే చెప్పిందా? ఏమో డౌట్‌గానే ఉన్నా నిజమే అనిపిస్తోంది.
Globe Trotter
ఈ సినిమా కోసం, ఈ సినిమా కథ చెప్పడాని కోసం ఓ పాటను రిలీజ్ చేసింది సినిమా టీమ్. ఆ పాటను ప్రముఖ నటి శ్రుతి హాసన్ ఆలపించింది. దానిని రిలీజ్ చేసే క్రమంలో చేసిన యూట్యూబ్ థంబ్ నెయిల్ మీద GlobeTotter అని వేశారు. పైన రాజమౌళి ఫిల్మ్ అని కూడా రాశారు. అదంతా చూస్తుంటే ఓ సినిమా పోస్టర్‌లానే ఉంది. దీంతో ఇదే సినిమా టైటిల్ అంటూ ఓ ప్రచారం మొదలైంది. అయితే సినిమా టైటిల్‌ను, మహేష్‌బాబు లుక్‌ను రిలీజ్ చేయడానికి ఓ ఈవెంట్‌ను పెడుతూ ఇలా టైటిల్ అనౌన్స్ చేసేస్తారా అనే డౌట్ వస్తోంది.
నిజానికి ఈ పాటను ఈవెంట్ రోజే రిలీజ్ చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఈ పాట థీమ్‌లోనే ఈ నెల 15న ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో ముందుగానే రిలీజ్ చేసేస్తే హైప్ వస్తుందని టీమ్ రిలీజ్ చేసింది అంటున్నారు. అందుకే టైటిల్ కూడా ముందే బయటకు వచ్చేసింది అని చెబుతున్నారు. అయితే ఇది అంతర్జాతీయంగా అవగాహన కోసం పెట్టిన టైటిల్ అని.. ఇండియన్ లాంగ్వేజెస్ కోసం మరో టైటిల్ పెట్టి.. ఈ పేరును సెకండరీగా చేస్తూ ఆ రోజు అనౌన్స్‌మెంట్ ఉంటుందని చెబుతున్నారు.
గ్లోబ్‌ట్రోటర్ అంటే.. ప్రపంచయాత్రికుడు అని అర్థం. ఆ పేరును అయితే రాజమౌళి పెట్టినట్లు కనిపించడం లేదు. అయితే మహేష్‌బాబుతో మాట్లాడి ఆయన ఓకే చేశాకనే టైటిల్ బయటకు వస్తుంది. అదేంటి అనుకుంటున్నారా? ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా అలానే వచ్చిందని టాలీవుడ్ టాక్. ఇది రాజమౌళి ఎప్పుడూ చేయనిది అని సమాచారం.