టైమింగ్… టైమింగ్… టైమింగ్.. దీని గురించి క్రికెట్‌లో ఎంతగా మాట్లాడుకుంటారో, సినిమాల్లో అంతలా మాట్లాడుకుంటారు. ఓ మాట ఎప్పుడు అనాలి, ఎలా అనాలి, దాని వెనుక లెక్కలు మన సినిమా వాళ్లకు బాగా తెలియాలి. తెలిసినవాళ్లే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటారు. ఇదంతా నటన గురించి మాత్రమే కాదు, ఆ తర్వాత మాటల్లో కూడా అని చెప్పాలి. మొన్నటికి మొన్న చిరంజీవి కొన్ని రాజకీయ టచ్ ఉన్న కామెంట్స్ చేశాడు. అవి వైరల్ అయ్యాయి. ఇప్పుడు మాటల రచ్చ జరుగుతోంది. అయితే అంతకంటే ముందు రజనీకాంత్ కూడా ఇదే స్టైల్‌లో కౌంటర్లు వేశాడు.
‘జైలర్’ సినిమాకు సంబంధించి కొన్ని రోజుల క్రితం చెన్నైలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఆ వీడియోను సన్ టీవీ ఇటీవల రిలీజ్ చేసింది. ఈ క్రమంలో రజనీకాంత్ స్టేజీ మీద గంటసేపు మాట్లాడారు. సినిమా గురించి, సినిమాలో నటీనటుల గురించి, నిర్మాత తదితర టెక్నీషియన్ల గురించి చెప్పాడు. వాటికి సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే రజనీ పొలిటికల్ టచ్ ఉన్న కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు టెలీకాస్ట్ తర్వాత వైరల్‌గా మారాయి. ‘అర్థమైందా రాజా’ అంటూ రజనీ అన్న మాటలు ఇప్పుడు మరింత వేడిని రాజేస్తాయని అనిపిస్తోంది.
అయితే, రజనీ (Rajinikanth) తన ప్రసంగంలో ఎక్కడా ఏపీ ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదు, మాట్లాడలేదు కూడా. అయితే ఆయన ఇటీవల ఏపీ ప్రభుత్వ పెద్దల నుండి వచ్చిన కామెంట్స్, తిట్లు.. అబ్బో ఒక్కటేంటి ఇలా చాలానే వచ్చాయి. వాటన్నింటికి సింగిల్ లైన్ పంచ్‌తో కౌంటర్ ఇచ్చాడు అని నెటిజన్లు అంటున్నారు. ‘‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా..’’ అని రజనీ అన్నాడు.
ఇదంతా తన మీద బురద జల్లేవారి కోసమే అని నెటిజన్ల అభిప్రాయం. పనిలోపనిగా ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ఈ కామెంట్లను ముందుకుతీసుకొస్తున్నాయి. ఇటు చిరంజీవి పంచ్‌లు, ఇటు రజనీ పంచులతో ఏపీ పాలిటిక్స్‌లో వేడి మామూలుగా లేదు అంటున్నారు. ఇంకెంతమందితో తిట్లు కాస్తారో అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!