Ram Charan: గౌతమ్ తో పాటు చరణ్ ఆ దర్శకుడిని కూడా పక్కన పెట్టాడా..?

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాంచరణ్ మూవీ యూవీ క్రియేషన్స్ లో ఉంటుందని వార్తలు వచ్చాయి. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో రాంచరణ్ 15వ సినిమాగా ఈ ప్రాజెక్టు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ దిల్ రాజు- శంకర్ కాంబినేషన్లో ఆర్.సి.15 ప్రాజెక్టు సెట్ అయ్యింది. అయితే ఆర్.సి.16 మాత్రం యూవీ క్రియేషన్స్ లో ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథ రాంచరణ్ కు నచ్చడంతో ఈ ప్రాజెక్టు సెట్ అయ్యింది అని అంతా అనుకున్నారు.

కానీ కట్ చేస్తే సీన్ లోకి బుచ్చిబాబు వచ్చాడు. ఈ ప్రాజెక్టు మైత్రి వాళ్లకి వెళ్ళింది. గౌతమ్ చెప్పిన కథ బాగున్నా.. అది తన ఇమేజ్ కు మ్యాచ్ అవ్వదేమో అని చరణ్ తప్పుకున్నట్టు అంతా చెప్పుకొచ్చారు. ఇక చరణ్ వద్దన్న కథను విజయ్ దేవరకొండతో చేయడానికి గౌతమ్ రెడీ అయ్యాడు. అయితే ‘యూవీ’ లో చరణ్ సైన్ చేసిన ప్రాజెక్టు సంగతేంటి? అనే ప్రశ్న చాలా కాలం నుండి వినిపిస్తోంది. అసలే విక్రమ్.. చరణ్ కు మంచి సన్నిహితుడు.

చరణ్ మాత్రమే కాదు చిరు కూడా ఈ బ్యానర్లో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మొన్నామధ్య కన్నడ దర్శకుడు నార్తన్ చెప్పిన కథ చరణ్ కు నచ్చింది అనే టాక్ వినిపించింది. ఇటీవల ఈ దర్శకుడిని కూడా చరణ్ పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు ఇంకా జరుగుతున్నాయి.

శంకర్, బుచ్చిబాబు లతో చేయాల్సిన సినిమాలు కంప్లీట్ అయ్యాక.. చరణ్ చేయబోయే సినిమా నార్తన్ తోనే కావచ్చు అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.అయితే నార్తన్ ప్రస్తుతం శివరాజ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాక చరణ్ .. ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus