Ramayana: రణ్‌బీర్‌ – సాయిపల్లవి సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌.. ఎవరూ ఊహించని విధంగా..

‘రామాయణం’ సినిమా ఎప్పుడు వచ్చినా, ఎవరు తీసినా చూడటానికి జనాలు సిద్ధంగా ఉంటారు. అందరికీ తెలిసిన కథే అయినా.. రామాయణం చూస్తే వచ్చే ఆ ఆనందమే వేరు. అయితే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘రామాయణ్‌’ కొత్తగా తెరకెక్కుతోంది. ఎక్కడా అఫీషియల్‌గా అనౌన్స్‌ కాని ఈ సినిమాలో తొలి పార్టు చిత్రీకరణ పూర్తయిపోయిందా? ఏమో బాలీవుడ్‌కి చెందిన కొందరి సోషల్‌ మీడియా ఖతాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పైన చెప్పినట్లు ‘రామాయణ్‌’ సినిమా మొదలైంది అనే విషయం ఎక్కడా అధికారికంగా చెప్పలేదు.

Ramayana

అయితే సినిమా నిర్మాణ సంస్థల వివరాలు మాత్రం తెలిశాయి. మనకు తెలిసిన సమాచారం, లీకుల ప్రకారం అయితే సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)  , సీతగా సాయి పల్లవి (Sai Pallavi)  నటిస్తోంది. ఇక రావణుడిగా యశ్‌ నటిస్తున్నాడు. అంతేకాదు ఆయన సినిమాలో నిర్మాణ భాగస్వామి కూడా. ఈ విషయం పక్కన పెడితే.. ఆసక్తికర అంశం ఒకటి తెలిసింది. ‘రామాయణ్‌’ (Ramayana) పార్ట్‌ 1షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం.

ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న కొందరు నటులు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. సినిమా సెట్‌లో రణ్‌బీర్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘రామాయణ్‌  (Ramayana) పార్ట్‌ 1 పూర్తయింది’ అని క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిందా, లేక రణ్‌బీర్‌ పాత్ర చిత్రీకరణ అయిందా లేక ఒక షెడ్యూల్‌ అయిందా అనే డౌట్స్‌ మొదలయ్యాయి. దీని మీద టీమ్‌ క్లారిటీ ఇస్తుందా? అనేది చూడాలి.

ఇక సినిమా (Ramayana) సంగతి చూస్తే.. నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్‌ (Sunny Deol) , కైకేయిగా లారా దత్తా (Lara Dutta) , శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) నటిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఆస్కార్‌ విన్నర్‌ DNEG ఆధ్వర్యంలో సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు జరుగుతున్నాయట. ఇక సినిమాకు తెలుగు సంభాషణలు రాసే బాధ్యతను త్రివిక్రమ్‌ తీసుకున్నారని టాక్‌. అయితే ఏ విషయాలూ అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు.

కమల్‌ హాసన్‌ అమెరికా టూర్‌.. అందుకోసమే వెళ్లారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus