తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ‘పరాశక్తి’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘గురు’ ‘ఆకాశం నీ హద్దురా’ వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకుడు. జయం రవి అలియాస్ రవి మోహన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
విలన్ గా చేస్తున్నందుకు రవి మోహన్ ఏకంగా రూ.25 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్టు కూడా మొన్నామధ్య టాక్ నడిచింది. మరో తమిళ హీరో అథర్వ మురళి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘డాన్ పిక్చర్స్’ బ్యానర్ పై తిరుచిరాపల్లి, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 5కి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ‘పరాశక్తి’ సినిమాలో టాలీవుడ్ హీరో రానా కూడా కీలక పాత్ర పోషించనున్నారు అనేది లేటెస్ట్ టాక్. దీనిపై టీం ఎటువంటి అనౌన్స్మెంట్ ఇచ్చింది లేదు. మరి ఎందుకు ఈ ప్రచారం మొదలైంది అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. విషయం ఏంటంటే… ‘పరాశక్తి’ లేటెస్ట్ షెడ్యూల్ ను తమిళనాడులోని కోయంబత్తూరు, పొల్లాచిలో నిర్వహిస్తున్నారు. హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ శ్రీలీల..లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో హీరో రానా కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. రానాకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో మీసాలు పెంచి కనిపిస్తున్నాడు రానా. అతని లుక్ కూడా బాగుంది. ఆల్మోస్ట్ శివ కార్తికేయన్ లుక్ కూడా ఇలానే ఉంది.
#ParaSakthi shooting la @RanaDaggubati ena panraru oru Vela intha movie #ranadaggubati Irukkuaru Pola podu pic.twitter.com/OH0BVQeJe8
— HARISH (@sk74582) July 22, 2025