రమేశ్ వర్మ డైరెక్షన్ లో రవితేజ హీరోగా ఖిలాడీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మే 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడిన సమయంలో ఈ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన శతురంగు వేట్టై2 కు రీమేక్ అని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల గురించి చిత్రయూనిట్ గతంలో స్పందించలేదు.
తాజాగా ఖిలాడీ డైరెక్టర్ రమేష్ వర్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా శతురంగ వేట్టై2 పేరు ఎత్తకపోయినా ఒక తమిళ సినిమాతో ఖిలాడీ సినిమాకు పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇంటర్వెల్ ట్విస్ట్ తమిళ సినిమాను పోలి ఉంటుందని రచయిత తనకు, నిర్మాతకు ఈ విషయం చెప్పిన తరువాతే సినిమా షూటింగ్ మొదలైందని రమేష్ వర్మ అన్నారు. క్రాక్ సినిమా సక్సెస్ తరువాత ఖిలాడీ స్క్రిప్ట్ లో మార్పులు చేయలేదని రమేష్ వర్మ తెలిపారు.
క్రాక్ రిలీజ్ కావడానికి ముందే ఖిలాడీ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తైందని మొదట అనుకున్న స్క్రిప్ట్ తోనే ఈ సినిమా షూటింగ్ జరిగిందని రమేష్ వర్మ చెప్పుకొచ్చారు. రవితేజ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నారా..? లేదా..? అనే ప్రశ్నకు మాత్రం రమేష్ వర్మ సమాధానం దాటవేశారు. క్రాక్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న రవితేజ ఖిలాడీ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.