Samantha: సినిమా కన్నా కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చిన సమంత.. ఇదే సాక్ష్యం?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారగా వెలుగొందిన సమంత ప్రస్తుతం ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతూ కెరియర్ లో ముందుకు సాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే సమంత విడాకులు తీసుకున్న తర్వాత కేవలం సినిమాలలో నటించడానికి అక్కినేని కుటుంబం కండిషన్ పెడుతుందన్న ఉద్దేశంతోనే తాను నాగచైతన్యకు విడాకులు ఇచ్చారు అనే ఊహాగానాలు కూడా వినపడ్డాయి.

నిజానికి సమంత పెళ్లి అయిన తర్వాత సినిమాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత అక్కినేని కుటుంబానికి ఇచ్చిందని, అక్కినేని కోడలుగా కుటుంబ గౌరవ, మర్యాదల కోసం ఎంతో కృషి చేసిందని తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం నయనతార కన్నా ముందుగా సమంతకి వచ్చిందట.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను 2019లో మొదలుపెట్టారు. అంటే అప్పటికి సమంతకు వివాహం జరిగి కేవలం రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు.ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం సమంతను సంప్రదించగా ఆమె కేవలం అక్కినేని కుటుంబ పరువు, గౌరవం కోసం ఈ సినిమాలలో నటించనని సున్నితంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. ఈ విధంగా ఈ సినిమాకి సమంత నో చెప్పడంతో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని నయనతార అందుకున్నారు.

దీన్ని బట్టి చూస్తే సమంతా వృత్తిపరమైన జీవితం కన్నా తన వ్యక్తిగత జీవితానికి, అక్కినేని కుటుంబ పరువు, ప్రతిష్టలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పాలి. ఇలా అక్కినేని కుటుంబం కోసం ఇంత చేసిన సమంత చివరికి నాగచైతన్యతో ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటికీ అంతుచిక్కని విషయమని చెప్పాలి.ఇక ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే యశోద, ఖుషి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus