RRR Movie: ‘ఆర్ఆర్‌ఆర్‌’ అవార్డుల విషయంలో ఓర్వలేనితనం ఎక్కువైందా.. అందుకేనా ఇలా!

మన పెరటింట్లో మొక్క వైద్యానికి పనికి రాదు అంటుంటారు. అంతేకానీ అది ఔషధం కాదు అని ఎక్కడా అనరు. దీన్ని సినిమాల్లోకి అన్వయిస్తూ.. మన పరిశ్రమలో రూపొందిన సినిమా అవార్డులు, రివార్డులకు పనికి రాదు అని లెక్కేసుస్తుంటారు మహానుభావులు. ఇది నిజం కాదని కొన్ని సినిమాలు చెబుతున్నా.. సినిమా జనాలు, అభిమానులు, నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. నాలుగు అవార్డులు వస్తే చాలు.. ఆ సినిమా టీమ్‌ అవార్డులు కొనేస్తోంది అంటూ ఏదేదో అనేస్తున్నారు. దీంతో సినిమా కోసం పడ్డ కష్టం విలువ.. ఇలా ‘కొనుక్కున్నారు’ అనే కామెంట్లతో మరుగన పడిపోతోంది.

ఇప్పుడు మేం చెబుతున్నది ‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. ఎందుకంటే ఇటీవల కాలంలో అవార్డుల చర్చ నడుస్తున్నది ఈ సినిమా కోసమే మరి. ఈ సినిమాకు అంతర్జాతీయంగా వచ్చిన, వస్తున్న అప్లాజ్‌ చూసి ఇన్నాళ్లూ కళ్లల్లో నిప్పులు పోసుకున్న కొంతమంది ఇప్పుడు అవార్డులు వస్తుండేసరికి అవార్డులు కొనేస్తున్నారు అంటూ విసర్లు విసరుగుతున్నారు. అన్నట్లు ఇవే అవార్డులు ఇతర పరిశ్రమల్లో ఎవరికైనా వస్తే.. ‘చూశారా అక్కడివాళ్లు ఎలాంటి సినిమాలు తీస్తున్నారో, అవార్డులు సంపాదిస్తున్నారు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు.

తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా అంతర్జాతీయ వేదిక మీద పెద్ద ఎత్తున అవార్డులు సంపాదిస్తోంది. ఎన్నో ఆంగ్ల సినిమాలు, ఇతర భాషల సినిమాలను దాటేస్తూ పురస్కారాల పంట పండిస్తోంది. రీసెంట్‌ అవార్డ్స్‌ అంటే.. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌. అందులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు 5 అవార్డులు వచ్చాయి. ఇవే కాదు అంతకుముందు కూడా ప్రతి వీకెండ్‌లో ఏదో అవార్డు వస్తూనే ఉంది. సినిమాకో, పాటకో, నటనకో ఇలా దేనికో ఒక దానికి ప్రశంస, పురస్కారం దక్కుతున్నాయి. ఈ క్రమంలో చిన్న చిన్న సంస్థలు కూడా అవార్డులు ఇస్తూ ప్రచారంలో తమ అవార్డ్స్‌ పేరు వచ్చేలా చూసుకుంటున్నాయి.

వాటని పట్టుకుని ట్రోలర్స్‌ పేరుతో గౌరవంగా చెప్పుకొనే కుహనా మేధావులు కొంతమంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అవార్డులు కొనుక్కుంటోంది అని అంటున్నారు. అయినా ఇప్పుడు అవార్డులతో సినిమా టీమ్‌కో, నిర్మాతకో, దర్శకుడితో కొత్తగా వచ్చేదేం లేదు. ఆల్‌రెడీ ప్రపంచ వేదిక మీద వాళ్లంతా తెలిసిపోయారు. ఇప్పుడు ఏమైనా వస్తోంది అంటే మన భారతీయ సినిమా పేరు వివిధ వేదికల మీద వినిపిస్తోంది. ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళి అండ్‌ కో.. మీద ఇలా విమర్శలు ఎంతవరకు కరెక్ట్‌ అనేది నెటిజన్లే ఆలోచించుకోవాలి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus