Sai Pallavi Marriage: సినిమాల తగ్గాయి… బాజాలు మోగడానికేనా?

వరుసగా సినిమాలు చేస్తున్న హీరోయిన్‌ ఒక్కసారిగా సినిమాలు ఓకే చేయడం మానేస్తే ఏమనుకోవాలి? అయితే రెస్ట్‌ కోసం లేదంటే పెళ్లి కోసం. ఈ రెండూ కాకుండా మరో కారణం ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి సాయిపల్లవి ఎందుకు సినిమాల బ్రేక్‌ ఇచ్చింది. ఏమో రెస్టేమో లేకపోతే పెళ్లేమో అని అంటరా? ఇందులో రెండోదో నిజమవ్వొచ్చు అంటున్నారు సన్నిహితులు. దీని వెనుక ఓ లాజిక్‌ కూడా చెబుతున్నారు. ‘ప్రేమమ్‌’ సినిమాతో 2015లో కెరీర్‌ను ప్రారంభించింది సాయి పల్లవి.

తెలుగులోకి ‘ఫిదా’తో 2017లో వచ్చింది. అంటే ఐదేళ్లకుపైగా సినిమాలతో అలరించింది. అయితే ఎక్కడా ఓవర్‌ బర్డెన్‌ తీసుకున్నట్లు కనిపించలేదు. ఏదో స్టార్‌ హీరోల లెక్కన ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసుకుంటానే వచ్చింది. కాబట్టి ఇక్కడ రెస్ట్‌ అవసరం అనే కాన్సెప్ట్‌ను లెక్కలోకి తీసుకోకూడదు. కాబట్టి.. మిగిలింది రెండో ఆప్షన్‌. అదే పెళ్లి. కెరీర్‌ను బలంగా నిర్మించుకున్న 29 ఏళ్ల సాయిపల్లవి వ్యక్తిగత జీవితంలో విషయంలోనూ అంతే ప్లానింగ్‌తో ఉంది అని అంటున్నారు.

అందుకే 30ల్లోకి రాగానే పెళ్లి చేసుకోవాలని చూస్తోందని టాక్‌. ఈ నెల 9న సాయిపల్లివి పుట్టిన రోజు. ఆ రోజు ఏదైనా కీలకమైన ప్రకటన ఉండొచ్చు అంటూ ఓ అంచనా లెక్కేసేస్తున్నారు నెటిజన్లు. 2021లో సాయిపల్లవి నుండి ‘లవ్‌స్టోరీ, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలొచ్చాయి. ఆమె ఏటా రెండేసి సినిమాలు చేస్తోందిలే అనుకోవచ్చు. అయితే ఈ టైమ్‌లో ఆమె కొత్తగా ఏ సినిమాలూ ఓకే చేయలేదు. అంతకుముందు ఓకే చేసినవి ఏవైనా సినిమాలున్నాయా అని చూస్తే…

విడుదలకు సిద్ధంగా ఉన్నది ఒకే ఒక్క సినిమా రానా ‘విరాటపర్వం’. రేపో మాపో ఆ సినిమా గురించి క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ అదీ వచ్చేస్తే ఇంక ఆమె చేతిలో సినిమాలు లేనట్లే. అయితే సాయిపల్లవి సన్నిహితులు మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. నటిగా తనకు మరింత మంచి పేరు తీసుకొచ్చే పాత్రలే చేయాలనుకుంటుందట. అందుకే కొత్త సినిమాలను ప్రకటించలేదని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముంది, అనేది తెలియాలంటే.. సాయిపల్లవి ప్రకటించే వరకు ఎదురుచూడాల్సిందే!

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus