Bigg Boss Telugu 5: షణ్ముక్ సిరితో ఎందుకు అలా మాట్లాడాడు..? నిజంగానే షణ్ముక్ ఊహించింది జరుగుతోందా.?

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ లెక్కలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ముఖ్యంగా ఎలిమినేషన్ అయిన తర్వాత నెక్ట్స్ గ్రూప్స్ మద్యలో టార్గెట్ ఎవరు అవుతారు అనేది ఈసారి సీజన్ లో చాలా లెక్కలు వేస్తున్నారు అందరూ. అయితే, షణ్ముక్ ఎప్పుడూ సిరికి ఈవిషయాన్ని చెప్తూ ఉంటాడు. ప్రియాంక ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా సిరికి హితబోధ చేశాడు షణ్ముక్. కాజల్ కి మరీ ఎక్కువ అటాచ్ అవ్వద్దని చెప్పాడు. చెప్పినట్లుగానే నైట్ అందరూ గ్రూప్ గా మాట్లాడుకునేటపుడు కాజల్ సన్నీ ఇంకా సిరి ఇద్దరికీ లింక్ పెడుతూ జోక్ చేసింది. సిరి కనిపిస్తే నీ అలియాభట్ వచ్చిందంటూ కామెంట్స్ వేసింది.

సన్నీ దీన్ని చాలా సరదాగా తీస్కున్నాడు. తను నాకు చెల్లి అంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ, షణ్ముక్ మాత్రం దీన్ని సీరియస్ గా తీస్కున్నాడు. సిరికి ఫుల్ క్లాస్ పీకాడు. మీ ఇద్దరి మద్యన ట్రాక్ క్రియేట్ చేయాలని చూస్తోందని, సన్నీతో గొడవపడిన వాళ్లందరూ వెళ్లిపోతున్నారు గమనించావా అంటూ సిరికి కౌన్సిలింగ్ చేశాడు. ప్రియా, రవి ఇలా అందరూ ఎలిమినేట్ అయ్యారు. అందుకే నిన్ను నా నుంచీ దూరం చేసి సన్నీతో గొడవ పెడితే నువ్వు వెళ్లిపోతావ్ అని అన్నాడు. అంతేకాదు, నీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది చూస్కో అంటూ హెచ్చరించాడు. కానీ, సిరి మాత్రం వాళ్లు చాలా సరదాగా అన్నారులే అంటూ లైట్ తీసుకునే సరికి షణ్ముక్ కి బాగా కోపం వచ్చింది.

నీకు చెప్పడం వల్ల నాకు రూపాయి కూడా ఉపయోగం లేదు అంటూ కోపంతో వెళ్లిపోయాడు. మార్నింగ్ షణ్ముక్ తనలో తాను మాట్లాడుకుంటూ, నేను చాలా బోరింగ్ పర్సన్ ని అని, ఇంకా హౌస్ లో ఎందుకు ఉన్నానా అంటూ బాధపడ్డాడు. ఫస్ట్ డే నుంచీ ఒంటరిగానే పోరాడుతున్నాను అని, మీరేమీ నాకు సాయం చేయలేదు బిగ్ బాస్ అంటూ మాట్లాడాడు. ఇక సిరిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో మార్నింగ్ కాసేపు మళ్లీ కౌన్సిలింగ్ చేశాడు. అయితే, ఇక్కడ షణ్ముక్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, నిజంగా ఈవారం సిరి వెళ్లిపోతుందని భయంతోనే అలా చెప్తున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే, గ్రూప్స్ గా మానస్, కాజల్, సన్నీ ముగ్గురూ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. అలాగే, శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్ అవ్వడు. ఎందుకంటే నామినేషన్స్ లో లేడు కాబట్టి, అందుకే ఇప్పుడు సిరి పైనే షణ్ముక్ కి డౌట్ ఉందని అలా మాట్లాడాడా అనేది ఇంట్రస్టింగ్ గా మారింది. నిజంగానే షణ్ముక్ ఊహించింది వీకెండ్ జరిగితే మాత్రం ఫైనల్స్ కి వెళ్లకముందే షణ్ముక్ బాగా డీలా పడిపోతాడు. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus