‘ఆర్ఆర్ఆర్’ వివాదం.. రాజమౌళి పట్టించుకుంటాడా..?

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి విడుదల చేసిన రామరాజు ఫర్ భీమ్ టీజర్ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ టీజర్ పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నేషనల్ జియోగ్రఫిక్ కి చెందిన ఓ డాక్యుమెంటరీలో షాట్స్ ని టీజర్ కోసం వాడేశారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు వీటికి తోడు మరికొన్ని విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. టీజర్ లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై విమర్శలు చెలరేగాయి. నిజాం పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా కొమరం భీమ్ పోరాడారని.. ఆయన కూతురుని అప్పటి ముస్లిం పాలకులు కొంతమంది ఇబ్బంది పెట్టారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

అలాంటి చరిత్ర ఉన్న భీమ్ పాత్రని చివర్లో ముస్లిం గెటప్ లో చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ సీబీఐ డైరెక్టర్ నాగేశ్వరారావు తన ట్విట్టర్ లో రాజమౌళిని సున్నితంగా హెచ్చరించారు. చరిత్రను వక్రీకరించడం కరెక్ట్ కాదని.. ఇలా చేసే బాలీవుడ్ తన విశ్వసనీయతను కోల్పోయిందని రాసుకొచ్చాడు. అయితే ఇలాంటి విమర్శలు వస్తాయని ముందుగానే ఊహించిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పూర్తిగా కల్పిత కథ అని చెప్పేశారు. అలాంటప్పుడు సినిమాలో పాత్రలకు రియల్ లైఫ్ క్యారెక్టర్ల పేర్లు పెట్టకుండా వేరే పేర్లను వాడితే ఎలాంటి సమస్య ఉండేది కాదు.

కానీ చరిత్రకు సంబంధించిన పేర్లు పెట్టి.. కల్పితమని చెబితే జనాలు పట్టించుకోకుండా ఎలా ఉంటారు. ‘కొమరం పులి’ సినిమా సమయంలో కూడా ఇంటి పేరు వాడుకోవడంపై రచ్చ జరిగింది. ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్ కి కొమరం భీమ్ పేరు పెట్టడంతో పాటు.. ముస్లిం గెటప్ వేయించారు. మరి ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి. అయితే కొమరం భీమ్ పాత్రకి ముస్లిం గెటప్ వేయడానికి ఓ కారణం ఉందని.. ఆయన ముస్లిం గెటప్ లో నైజాం అడ్డాలో చేరి తను అనుకున్నది సాధించడమనేది సినిమాలో ట్విస్ట్ అని చెబుతున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus