బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల రచ్చ అనేది స్టార్ట్ అయ్యింది. ఆడా మగా అంటూ తేడాలేకుండా ఆడే ఈ టాస్క్ లు అటు హౌస్ మేట్స్ కే కాదు., ఇటు వ్యూవర్స్ కి కూడా మంచి కిక్ ఇస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు కలబడి ఆడుతుంటే బిగ్ బాస్ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. టాస్క్ ఎవరు గెలిచారు అనేదానికంటే కూడా టాస్ లో ఎవరు జెన్యూన్ గా ఆడారు అన్నదానికే ఓట్లు వేస్తారు.రవి విశ్వ ఆర్గ్యూమెంట్ లో మైయిన్ పాయింట్ శ్రీరామచంద్రే అయ్యాడు. ఇక్కడే తను పరిగెత్తి గేమ్ ఆడే ప్రయత్నమే చేశాడు. బెడ్ రూమ్ లో ఉల్ఫ్ టీమ్ దాచుకున్న పిల్లోస్ ని తీస్కుందామనే వచ్చాడు.
అక్కడే వెనక్కితిరిగి చూసిన కాజల్ శ్రీరామ్ చంద్రకి అడ్డుగా నిలబడింది. ఇక్కడ రవి ట్రిగ్గర్ అయ్యాడు. అక్కడున్న లహరి కూడా సూపర్ బ్రో సూపర్ బ్రో అంటూ క్లాప్స్ కూడా కొట్టింది. ఇది గేమ్ స్ట్రాటజీ అనుకున్నాడు రవి.. మాకు తెలుసులే అంటూ విశ్వతో మాట్లాడాడు. అంతేకాదు, ఇదంతా యువర్స్ ఛీ అంటూ మాట కూడా తూలాడు. నిజానికి లోబో నిజంగానే పడిపోయాడు.. కానీ శ్రీరామ్ చంద్ర చేసిన ఈ కవ్వింపు చర్యకి ట్రిగ్గర్ అయ్యాడు రవి.. ఇదంతా ప్లాన్ అనుకున్నాడు.ఒకవేళ కాజల్ బెడ్ రూమ్ కి అడ్డంగా శ్రీరామ్ కి నిలబడి ఉండకపోతే నిజంగా శ్రీరామ్ చంద్ర ఏం చేసేవాడో చూసి ఉండాల్సింది. అప్పుడు గేమ్ ఆడేవాడో కాదో క్లారీటీ వచ్చేసేది. కానీ, విశ్వకి – రవికి గొడవ అవుతుంటే శ్రీరామ్ చంద్ర మాత్రం బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావ్..
ఏం కాలే.. ఏంకాలే నడువు అని చెప్పావ్ అంటూ రవితో మాట్లాడాడు.. టాపిక్ అంటు డైవర్ట్ అయిపోయింది. నువ్వే చెప్పినావ్ ఏం కాలే అని అన్నాడు శ్రీరామ్. అంతేకాదు, నేను మెడిసిన్స్ కోసమే వెళ్లాను అని చెప్పాడు. గతంలో కూడా నా దగ్గర ఓఆర్ యస్ ఉంటే లోబోకి ఇచ్చానని చెప్పాడు. అయితే, శ్రీరామ్ చంద్ర నిజంగానే మెడిసిన్స్ కోసం వెళ్లి ఉంటే ఈవిషయం కాజల్ కి సీరియస్ గా చెప్పి ఉండాల్సింది. అది చెప్పకుండా అక్కడ కవ్వించాడు. ఉమా, మానస్, కాజల్ ప్రొటక్ట్ చేస్కునే సరికి చేసేది ఏమీ లేక వచ్చేశాడు. ఇక్కడ శ్రీరామ్ డబుల్ గేమ్ ఆడుతున్నాడా లేదా జెన్యూన్ గానే కరెక్ట్ గా చెప్పాడా అనేది అతనికే తెలియాలి. చెప్పింది మెడిసిన్స్ కోసమని, కానీ అడింది మాత్రం గేమ్. ఇదే విషయం లహరి సన్నీతో అన్ సీన్లో ఎక్స్ ప్లైయిన్ చేసే ప్రయత్నం చేసింది. ఫస్ట్ ఉమెన్ కార్డ్ తీసింది శ్రీరామ్ చంద్రే అని గుర్తుచేసింది.