Varun Tej, Lavanya: వరుణ్ ప్లాన్ బాగుంది.. ఆ స్టార్ డైరెక్టర్ తో వెడ్డింగ్ వీడియో.!

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్…చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని వరుణ్, లావణ్య ఖండించారు. 2021 లోనే వరుణ్ తేజ్ కు పెళ్లి చేయాలని నాగబాబు అనుకున్నారు. కానీ లావణ్య త్రిపాఠితో అతను ప్రేమలో ఉండటం వల్ల.. ఇరు కుటుంబ సభ్యులను కన్విన్స్ చేయడానికి టైం పట్టినట్లు సమాచారం. ఎట్టకేలకు జూన్ 9న లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ ల ఎంగేజ్మెంట్ జరగబోతుంది అని అనఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది.

చాలా సింపుల్ గా వీరి ఎంగేజ్మెంట్ వేడుకను నిర్వహించబోతున్నారు. నాగ బాబు ఇంట్లో నిశ్చితార్ధానికి అవసరమైన పనులు మొదలయ్యాయట. మరో రెండు, మూడు రోజుల్లో లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ హైదరాబాద్ కు చేరుకోనుంది. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనుంది. ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ (Varun Tej) – లావణ్య త్రిపాఠి ల వెడ్డింగ్ ను షూట్ చేయడానికి ఓ స్టార్ డైరెక్టర్ రంగంలోకి దిగబోతున్నాడట.

అతను మరెవరో కాదు గౌతమ్ వాసుదేవ్ మీనన్. నయనతార – విగ్నేష్ శివన్ ల వెడ్డింగ్ ను కూడా ఇతనే షూట్ చేయించడం జరిగింది. వీరి పెళ్లి వీడియోని డిజిటల్ సంస్థలు భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. బాలీవుడ్లో అయితే ఈ ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల వెడ్డింగ్ తో టాలీవుడ్లో కూడా ఈ ట్రెండ్ మొదలుకాబోతుందన్న మాట.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus