Tamannaah: తమన్నా పెళ్లి డేట్‌ ఇదే అంటూ బాలీవుడ్‌లో ప్రచారం.. నిజమేనా?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ప్రేమలు పుడతాయి, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది మనం చెప్పలేం. అలా అనుకోకుండా బయటకు వచ్చిన జంట తమన్నా – విజయ్‌ వర్మ. ఈ హీరోయిన్‌ – విలన్‌ జోడీ.. ఈ మధ్య సోషల్‌ మీడియాలో టాప్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారారు. ఇద్దరూ కలసి విహార యాత్ర చేశారని వార్తలొచ్చాయి. ఈ మేరకు కొన్ని ఫొటోలు కూడా బయటికొచ్చాయి. ఆ సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే.. ఇద్దరి ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి డేట్ ఫిక్స్‌ అయ్యాయి అంటున్నారు.

తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కరం దాటిపోయినా.. ఇంకా సినిమా ఛాన్స్‌లు సంపాదిస్తూనే ఉంది. అయితే ఏమైందో ఏమో.. ఇన్నాళ్లూ ఎప్పుడూ లేని రిలేషన్‌షిప్‌ కల్చర్‌లోకి తమన్నా వచ్చింది. ఈ మధ్య నటుడు విజయ్ వర్మతో క్లోజ్‌గా మూవ్ అవుతోంది అంటున్నారు. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో ఈ జంట ముద్దుల్లో మునిగి తేలారు అనేది వైరల్‌ ఫొటోల సారాంశం. ఈ క్రమంలో ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవాలని ఇద్దరూ ఫిక్స్‌ అయ్యారు అని చెబుతున్నారు. దాని కోసం స్పెషల్‌ డేట్‌ ఎంచుకున్నారట.

ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల దినోత్సవం రోజు తమన్నా, విజయ్ వర్మకు ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయినట్లుగా బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే నిశ్చితార్థం తేదీతో పాటు మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఏప్రిల్ 21న తమన్నా – విజయ్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వ్యక్తిగత విషయాల్లో ఇలా వార్తలు రాస్తే తమన్నాకు నచ్చవు. ఏదైనా ఉంటే నేనే చెబుతా అని అంటుంటుంది కూడా.

మరి పెళ్లి విషయంలో తమన్నా ఎప్పుడు అఫీషియల్‌గా సమాచారం ఇస్తుందో చూడాలి. అప్పుడే ఈ తమన్నా వెడ్స్‌ విజయ్‌ అనే విషయం అఫీషియల్‌ అనుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం తమన్నా చేతిలో సినిమాలు తక్కుగానే ఉన్నాయి. ప్లాన్‌డ్‌ తగ్గించుకుందా? లేక తగ్గాయా అనే విషయం కూడా ఆమెనే చెప్పాలి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus