Kalki: ‘కల్కి’ గురించి ఆయన చెప్పే విషయాలన్నీ నిజమేనా? ఎందుకిలా చెప్పారో?

ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి రోజుకో పుకారు బయటకు వస్తోంది. సినిమా ఇలా ఉంటుంది, సినిమా అలా ఉంటుంది అనేవి ఒక రకం అయితే… మరో రకం పుకార్లు కాస్టింగ్‌ గురించి. ఈ సినిమాలో ఆ స్టార్‌ హీరో ఉంటాడు, ఈ స్టార్‌ హీరో అతిథి పాత్రలో నటిస్తాడు అంటున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. కారణం ఆయన గతంలో ఆ సినిమాకు పని చేశాను అని చెప్పడమే.

‘కల్కి’ సినిమాలో దీపిక పడుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా… అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ, కమల్‌ హాసన్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, రానా, రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ లాంటివాళ్లు గెస్ట్‌ రోల్స్‌లో కనిపిస్తారు అని వార్తలొస్తున్నాయి. ఆ లిస్ట్‌కు ఇటీవల తారక్‌ పేరు కూడా యాడ్‌ అయ్యింది. ఈ సినిమలో చిన్న నిడివి ఉన్న కీలక పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తాడని ఆ వార్తల భోగట్టా.

అయితే తాజాగా ఈ విషయంపై ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో చూచాయగా సమాధానం ఇచ్చారు. నిజానికి ఆ సమాధానాన్ని అధికారికంగా తీసుకోలేం. అయితే ఆయన గతంలో ‘కల్కి’ సినిమాకు ఫ్రీలాన్స్‌లో పని చేశాను అని చెబుతున్నారు. సినిమాలో మైథలాజికల్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయని చెప్పిన ఆయన… రామాయణం, మహాభారతానికి సంబంధించిన అంశాలు ఉంటాయని తెలిపారు.

అయితే సినిమాకు (Kalki) క్రియేటివ్‌ వర్క్ విషయంలో సినిమా టీమ్తో చిన్న మనస్పర్థలు వచ్చాయని, అందువల్ల సినిమా గురించి ఎక్కువగా చెప్పను అని తెలిపారు. అయితే ఆయన మాటల్లో నిజం ఎంత అనేది చెప్పాలి. అన్నట్లు తారక్‌ గురించి ఏం చెప్పారో మీకు చెప్పలేదు కదా… ‘సినిమా వచ్చాక అందులో చూడండి మీకే తెలుస్తుంది’ అని అన్నారు.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus