మంచు బ్రదర్స్ మధ్య ఆ ఒక్క ఇష్యు అడ్డంగా ఉందా..!

మంచు ఫ్యామిలీ (Manchu Brothers) గొడవలు అందరికీ తెలిసినవే. విష్ణు (Manchu Vishnu), మోహన్ బాబు (Mohan Babu) ఒక వైపు.. మంచు మనోజ్ (Manchu Manoj)  ఇంకో వైపు అయిపోయారు. ఈ విషయంలో ఉన్న బాధని మనోజ్ ‘భైరవం’ (Bhairavam) ప్రమోషన్లలో పరోక్షంగా వెళ్ళగక్కుతూనే ఉన్నాడు. విష్ణుకి అతను చాలా సందర్భాల్లో చురకలు అంటించాడు. కానీ మొత్తానికి ఇప్పుడు అతను తగ్గినట్టు కనిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘నేను శివుణ్ణి అడ్డంపెట్టుకుని అతన్ని అలా అనడం తప్పు. పైగా ఆ సినిమాని కూడా నేను కించపరిచినట్టు అయ్యింది.

Manchu Brothers

కాబట్టి నేను మనసారా క్షమాపణలు చెబుతున్నా. అలాగే ఆ శివుణ్ణి కూడా నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. ఆ సినిమాని ఎంతో మంది టెక్నిషియన్స్ కష్టపడి తీశారు. కాబట్టి అది పెద్ద విజయం సాధించాలి’ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు. అలాగే మరో ఇంటర్వ్యూలో ‘నేను అతనితో(విష్ణుతో) కలిసిపోవడానికి రెడీగా ఉన్నాను. మీరు ఫోన్ చేసి చెప్పండి.. నేను వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. సో మనోజ్ చాలా వరకు తగ్గాడు. మంచు విష్ణు కూడా తగ్గితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది.

కానీ విష్ణు ఇప్పుడు ‘కన్నప్ప’ (Kannappa) హార్డ్ డిస్క్ పోయిన టెన్షన్లో ఉన్నాడు. అందులో ‘దాదాపు గంటన్నర పైనే ఫుటేజ్ ఉంది. ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్స్ అన్నీ అందులోనే ఉన్నాయని’ చెప్పి అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మనోజ్ హ్యాండ్ కూడా ఉందని.. ఆ హార్డ్ డిస్క్ తీసుకుపోయిన వాళ్ళు మనోజ్ కి చాలా క్లోజ్ అని.. సో పరోక్షంగా మనోజ్ ఈ పని చేయించి ఉండవచ్చు అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus