‘కె.జి.ఎఫ్’ ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక కన్నడ చిత్రం అంతలా హిట్టయ్యి దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది అంటే అది మామూలు విషయం కాదు. తెలుగులో కూడా రెండు క్రేజీ చిత్రాలు విడుదలయ్యినా, అలాగే బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరో చిత్రం విడుదలైనా ‘కె.జి.ఎఫ్’ ఓ రేంజ్లో నిలదొక్కుకుని షారుఖ్ చిత్రాన్ని పక్కన పెట్టి మరీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో డైరెక్టర్… హీరోని ఎలేవేటే చేసిన తీరుకి అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఇక ఈ చిత్రం శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈమె కనిపించింది కాసేపే అయినా… సినిమా భారీ విజయం సొంతం చేసుకోవడంతో ఈమెకు కూడా స్టార్ హీరోయిన్ గా పేరొచ్చింది. వెంటనే ఈమెకు వరుస ఆఫర్లు అందాయట. తెలుగుతో పాటూ తమిళ, మలయాళ భాషల్లో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయట. ఒకటి కాదు.. రెండు కాదు… ఈమెను వెతుక్కుంటూ ఏకంగా 7 ఆఫర్లు వచ్చాయంట. సాధారణంగా ఓ భారీ హిట్టందుకున్న తరువాత… ఉన్న క్రేజ్ ను యూజ్ చేసుకుని క్యాష్ చేసుకోవాలని ఏ హీరోయినయినా కోరుకుంటుంది. అలా వచ్చిన ఆఫర్లన్నిటికి ఓకే చెప్పేస్తుంది. కానీ శ్రీనిధి శెట్టి మాత్రం ఆ 7 ఆఫర్లను వద్దని తిరస్కరించిందట. దీనికి ముఖ్య కారణం ‘కె.జి.ఎఫ్2’ అనే తెలుస్తుంది. మొదటి పార్ట్ అంత హిట్టవ్వడంతో రెండో పార్ట్ పై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకోసమే ‘కె.జి.ఎఫ్2’ ను భారీగా ప్లాన్ చేస్తున్నాడట. ఎప్పుడడిగితే అప్పుడు డేట్లు ఇచ్చేలా శ్రీనిధి కూడా కమిటయ్యిందట. ఇందుకోసమే ఆ 7 ఆఫర్లని తిరస్కరించిందని సమాచారం. మరి ‘కె.జి.ఎఫ్2’ ఏ రేంజ్ విజయం సాధిస్తుందో… ఈ చిత్రాన్ని నమ్ముకుని ఇన్ని ఆఫర్లు వదిలేసిన ఈ అమ్మడికి ఎలాంటి క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.