అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మేజర్’. 26/11 ముంబై దాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘మేజర్’ జూన్ 3న విడుదల కాబోతుంది. శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని మహేష్ బాబు ‘జీఏంబీ ఎంటర్ టైన్మెంట్’, ‘ఏ ప్లస్ ఎస్ మూవీస్’ తో కలిసి ‘సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా’ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. సినిమా పై అవి మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ‘ది కశ్మీర్ ఫైల్స్’ కు మించి ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే 2011 నవంబర్ లో ముంబైలో జరిగిన దాడుల్లో సందీప్ ఉన్ని కృష్ణన్ తో పాటు చాలా మంది సైనికులు చనిపోయారు. కానీ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ మాత్రమే ఎందుకు తీశారు? అనే అనుమానం అందరిలోనూ ఉంది. అందుకు దర్శకుడు శశి కిరణ్ తిక్క క్లారిటీ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ.. “సహజంగా ఇన్స్పిరేషన్ అనేది ఎలా వస్తుందంటే, ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉంటారు. కానీ ఎఫెక్ట్ ఒకరి పైనే పడుతుంది. మిగిలినవారు తక్కువ అనేది నా ఉద్దేశం కాదు. వాళ్ళ గురించి కూడా ఎవరో ఒకరు కథలు రావచ్చు. శేష్ కు సందీప్ పాత్ర బాగా కనెక్ట్ అయ్యింది. మిగిలిన ఆఫీసర్ ల గురించి ముందు ముందు ఫిలిం మేకర్స్ సినిమాలు ప్లాన్ చేయొచ్చు. కానీ ఇక్కడ బయోపిక్ అనేది అందరి ఇష్టంతో చేయగలగాలి.
అంతకు మించి ఎక్కువ చెప్పలేము. సందీప్ ఫ్యామిలీ మాకు బాగా సహకరించింది. అతని హావభావాలు ఎలా ఉంటాయి.. అలవాట్లు వంటి విషయాల్లో వాళ్ళు మాకు సహకరించి ప్రోత్సహించారు” అంటూ చెప్పుకొచ్చాడు. నిజమే బయోపిక్ అనేది అందరి ఇష్టంతో ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఎన్నో వివాదాలు తలెత్తుతాయి. గతంలో ఎన్నో బయోపిక్ ల విషయాల్లో ఇలాంటివి మనం చూశాం.