తెలుగులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సినిమా చేస్తే చూడాలని కుర్రకారు చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నారు. అతిలోక సుందరి (Sridevi) వారసురాలు బాలీవుడ్‌లో సినిమా చేస్తుంటే… మనకెప్పుడు చేస్తుంది. ఆమెను మనం ఎప్పుడు మన హీరోయిన్ అనుకునేది అని వెయిట్ చేస్తున్నారు. అయితే ‘దేవర’ (Devara) సినిమాతో ఆ కల నెరవేరనుందని తేలిపోయింది. ఏప్రిల్‌లో సినిమా వచ్చేస్తుంది అనేసరికి ఇంకా హ్యాపీ అనుకున్నారు. ఆ విషయం పక్కనపెడితే రెండో సినిమా కూడా తేలిపోయింది. దీంతో ఇప్పడు చర్చ మూడో సినిమా.
అదేంటి, ప్రతి సినిమాకూ ఇలా లెక్కలేసుకోవడమేనా అంటారా? మామూలుగా అయితే తొలి సినిమా, రెండో సినిమా వరకు ఈ క్యూరియాసిటీ ఉంటుంది. కానీ జాన్వీ విషయంలో మూడో సినిమాకు కూడా ఎందుకింత క్యూరియాసిటీ అంటే… ఆమెను ఫుల్ ప్లెడ్జ్ మాస్ రోల్‌లో చూడాలనేది అభిమానుల కోరిక. అంటే ‘దేవర’లో జాన్వీ పాత్ర విలేజ్ గర్ల్ తంగం అని తేలిపోయింది. కాబట్టి పెద్దగా గ్లామర్‌ను ఆశించలేం. ఇక (Ram-Charan) రామ్‌చరణ్ – బుచ్చిబాబు సానా (Buchi Babu) సినిమా విషయంలోనూ ఇదే పరిస్థితి అని చెప్పాలి.
ఆ సినిమాలో కూడా పద్ధతైన రోల్‌లోనే జాన్వీ కనిపిస్తుంది అని అంటున్నారు. కాబట్టి రొమాన్స్‌ను ఆశించలేం అనేది అభిమానుల లెక్క. ఈ నేపథ్యంలో మూడో సినిమాలో అయినా కాస్త హాట్ జాన్వీని చూద్దామని అనుకుంటున్నారు. ఈ సమయంలోనే (Pushpa 2) ‘పుష్ప: ది రూల్’లో జాన్వీ అంటూ ఓ పుకారు మొదలైంది. తొలి ‘పుష్ప’లో ‘ఉ అంటావా..’ అంటూ సమంత ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు రెండో ‘పుష్ప’లో అంతకుమించిన ఊపు కావాలని జాన్వీని సంప్రదిచారని టాక్. అంటే ఓ మాస్ ఐటెమ్ కోసం అన్నమాట.
మామూలుగా అయితే హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఐటెమ్ సాంగ్ చేయడానికి ఇప్పటి హీరోయిన్లు నో చెప్పడం లేదు. అయితే తెలుగులో ఇప్పుడే వస్తోంది కదా చేస్తుందా లేదా అనే డౌట్ ఉంటుంది. అయితే ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు. అదే జరిగితే జాన్వీ మూడో సినిమా ఇదే అవుతుంది. అది తేలిపోతే నాలుగో సినిమా సంగతి చూద్దాం. మళ్లీ ఇదేంటి అంటారా? ఫుల్ ప్లెడ్జ్ గ్లామర్ రోల్‌లో చూడాలి కదా మరి.