Maha Samudram Movie: శర్వానంద్ ‘మహాసముద్రం’ లో ఆ సినిమా పోలికలు..!

‘ఆర్.ఎక్స్.100’ వంటి పాత్ బ్రేకింగ్ మూవీని అందించిన దర్శకుడు అజయ్ భూపతి …తన తరువాతి చిత్రాన్ని శర్వానంద్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మహాసముద్రం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ కూడా సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. అదితి రావు హైదరి,అనూ ఇమాన్యుల్ లు హీరోయిన్లు కావడం విశేషం. ప్రేమ, స్నేహం, కక్ష సాధింపు వంటి అంశాలను ఈ చిత్రంలో కొత్తగా చూపించబోతున్నాడట దర్శకుడు.’ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 19న విడుదల చేయబోతున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ డేట్ కు విడుదల కాకపోవచ్చు అనే డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం కథ కాపీ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘మహాసముద్రం’ కథతోనే గతంలో ఓ సినిమా వచ్చిందట. వివరాల్లోకి వెళితే.. గతంలో నవీన్ చంద్ర హీరోగా ‘దళం’ అనే సినిమా వచ్చింది. ‘జార్జి రెడ్డి’ వంటి చిత్రాన్ని అందించిన జీవన్ రెడ్డి ‘దళం’ ను తెరకెక్కించాడు.

2013 వ సంవత్సరం ఆగష్టు 13 న ఈ చిత్రం విడుదలయ్యింది. టాక్ బాగానే వచ్చింది కానీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ‘మహాసముద్రం’ కథ కూడా ఇంచు మించు ‘దళం’ లానే ఉండబోతుంది అని సమాచారం. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus