NTR, Koratala Siva: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పనున్న కొరటాల..?

జనతా గ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మే 20వ తేదీన ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ టైటిల్ రివీల్ అవుతుందని ఫ్యాన్స్ భావించగా చివరకు నిరాశే ఎదురైంది. అయితే అప్పుడు నిరుత్సాహపరిచిన కొరటాల శివ త్వరలో తారక్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పనున్నారని తెలుస్తోంది.

జూన్ నెల 15వ తేదీన కొరటాల శివ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఆరోజు ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ టైటిల్ రివీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎన్టీఆర్ బర్త్ డేకు అప్ డేట్ మిస్సైనా కొరటాల బర్త్ డేకు మాత్రం అప్ డేట్ కచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. కొరటాల శివ మరోసారి ప్రేక్షకుల అంచనాలకు అందని టైటిల్ తో సర్ప్రైజ్ చేయనున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఈ సినిమాలో నెవ్వర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుందని అభిమానుల అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ను కొరటాలశివ అద్భుతంగా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా కొరటాల శివ ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటానని భావిస్తున్నారు. ఆగష్టు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus