Mahesh Babu , Rajamouli: మహేష్- రాజమౌళి.. టైటిల్ అదేనట?

  • July 26, 2024 / 06:40 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (S. S. Rajamouli)  దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో వార్త ప్రచారమవుతోంది. ఈ సినిమా షూటింగ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్డేట్ అప్పుడొస్తుంది.. ఇప్పుడొస్తుంది? అంటూ రకరకాల వార్తలు ట్రెండింగ్లో ఉంటున్నాయి. అంతేకాదు నటీనటుల విషయంలో కూడా అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విక్రమ్  (Vikram) , పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)  వంటి స్టార్లు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్టు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే చిత్ర బృందం ఏ విషయంలోనూ క్లారిటీ ఇవ్వడం లేదు. రాజమౌళి టీం కానీ మహేష్ బాబు టీం కానీ.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. మహేష్ బాబుతో సినిమా విషయంలో రాజమౌళి ప్లాన్స్ పూర్తిగా వేరుగా ఉన్నాయి. ఆగస్టు 9న కూడా అప్డేట్ ఇవ్వడానికి రాజమౌళి సిద్ధంగా లేరు. రాజమౌళి సినిమా కాబట్టి.. మహేష్ టీం కూడా పూర్తిగా రాజమౌళికి సరెండర్ అవ్వాల్సిందే.

అయితే తర్వాత కచ్చితంగా.. ఓ మోషన్ పోస్టర్ తో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇవ్వాలని రాజమౌళి అండ్ టీం భావిస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ గురించి కూడా ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇది అడ్వెంచరస్ డ్రామా. అందువల్ల దీనికి ‘గోల్డ్’ అనే పేరు పెట్టాలని రాజమౌళి భావిస్తున్నారట. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న టైటిల్ ఇది. పైగా మహేష్ బాబును కూడా అభిమానులు ‘బాబు బంగారం’ అని పిలుచుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ టైటిల్ వారికి కూడా నచ్చే అవకాశం ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus