ప్రస్తుతం మెహర్ రమేష్ కు మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో అవకాశం ఎలా వచ్చింది అనేది అందరిలో మెదులుతున్న ఒక పెద్ద సందేహం. నిజానికి అతనికి హిట్ సినిమా తీసే శక్తి ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఆంధ్రావాలా సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా కూడా అదే కథను కన్నడలో తీసి మెహర్ రమేష్ బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. పూరి జగన్నాథ్ అతని బలాన్ని చూసి ఫిదా అయిపోయాడు.
అందరూ రమేష్ లో శక్తి, షాడో డిజాస్టర్స్ నే చూస్తున్నారు కానీ అతను కూడా ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న కొన్ని సినిమాలకు వెన్నుముకగా నిలిచాడు. ఆ విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పోకిరి, దేశముదురు సినిమాలకు మెయిన్ రైటర్ గా వర్క్ చేశాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి అతనిపై ముందు నుంచే కొంత నమ్మకంతో ఉన్నాడు. అయితే బిల్లా అనంతరం మెహర్ రమేష్ బ్యాడ్ లక్ వల్ల శక్తి, షాడో సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టడంతో మళ్ళీ అతని వైపు ఎవరు చూడలేదు.
అయితే రీమేక్ సినిమాలతో ఒక్కసారి కూడా దెబ్బ తినని రమేష్ కు మెగాస్టార్ పిలిచి మరీ వేదాళం రీమేక్ చేసే ఛాన్స్ ఇస్తున్నాడు. ఇక మెగాస్టార్ స్టైల్ కు తగ్గట్టుగా ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేయగా అందరికి నచ్చేసిందట. ఫ్యాన్స్ కొంత అప్సెట్ లో ఉన్నప్పటికీ మెగాస్టార్ మాత్రం మెహర్ రమేష్ పై నమ్మకంతో ఉండడం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!