‘నాన్నకు ప్రేమతో’ సినిమా తారక్/సుకుమార్ చెప్పినట్లు ‘ఎక్కడో జరిగిన ఓ మూమెంట్.. ఇంకెక్కడో జరగాల్సిన మూమెంట్‌ను ప్రభావితం చేస్తుంది’ అన్నట్లు… అప్పుడెప్పుడో దర్శకుడు కొరటాల శివ చేసిన పని… ఇప్పుడు జరిగినదాన్ని దృష్టిలో పెట్టుకునే చేశాడు అంటూ ఓ సినిమా లాజిక్ అనుకుంటున్నారు నెటిజన్లు. ఇదంతా ‘ఆచార్య’ సినిమా ఫలితం గురించే అని మీకు అర్థమైపోయుంటుంది. ఆచార్య ఒక్కటే కాదు.. ట్విటర్ అకౌంట్ గురించి కూడా కలిపి అని చెప్పొచ్చు.
‘ఆచార్య’ సినిమా సెట్స్ మీద ఉండగా కొరటాల శివ ట్విటర్ ఖాతాను క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారు, ఏమైంది అంటూ కొన్ని రోజులు చర్చ జరిగింది. అయితే అప్పుడు నోరు మెదపని కొరటాల శివ.. మొన్నీ మధ్య నోరు విప్పారు. సోషల్ మీడియా అవసరమే కానీ.. లేనిపోని నెగిటివిటీ ఎక్కువైపోయిందని అందుకే దాని నుండి బయటకు వచ్చేశానని చెప్పారు. అంతలా ఆయనను ఎప్పుడు సోషల్ మీడియాలో ఎవరూ రోస్ట్ చేసింది లేదు. దీంతో ‘ఏదో జరిగింది?’ అని ప్రశ్న అలానే ఉండిపోయింది.
అఇయతే ‘ఆచార్య’ ఫలితం చూశాక… కొరటాల ఫ్యూచర్‌ను ఊహించి ముందుగానే ట్విటర్ నుండి బయటకు వచ్చేశారా? అనే ప్రశ్నలు ఇప్పుడు మొదలయ్యాయి. ‘వినయ విధేయ రామా’ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో బోయపాటి శ్రీనును ఓ ఆట ఆడుకున్నారు నెటిజన్లు. మీమ్స్, వీడియోస్, ఇంటర్వ్యూ బిట్స్ ఇలా ఎక్కడా వదలలేదు. దీంతో ఆయన చాలా హర్ట్ అయ్యారు అనే అంటారు. ఇప్పుడు కొరటాల పరిస్థితీ అంతే. ‘ఆచార్య’ గురించి మీమ్స్ జాతర అయితే జరుగుతోంది.
ఒకవేళ కొరటాల ఇప్పుడు ట్విటర్‌లో ఉంటే ఆ మీమ్స్, నెగిటివిటీని చూసి తట్టుకోలేరు అని అంటున్నారు సన్నిహితులు. దీంతో ‘ఆచార్య’ ఫలితం ఊహించి ఇలా చేశారా? లేక అనుకోకుండా రెండూ జరిగాయా అనేది తెలియాల్సి ఉంది. మరోసారి ఎప్పుడైనా కొరటాల బయటకు వస్తే ఈ విషయం అడిగి తెలుసుకోవాలి. అన్నట్లు తారక్ అయితే తన సినిమా గురించి ఇంకాస్త టైమ్ తీసుకొని మంచిగా కథ రెడీ చేయ్ అని కొరటాలకు సజెస్ట్ చేశారట.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!