Jr NTR: ‘వేట్టయన్‌’ ఎఫెక్ట్‌.. తారక్‌ సినిమా పేరు కూడా మారుతోందా?

తెలుగు ప్రజలు ఇచ్చే టికెట్‌ డబ్బులు కావాలి కానీ తెలుగులో పేరు పెట్టరు అంటూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏకంగా ఆ డబ్బింగ్‌ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్న నిర్మాతలు ప్రెస్‌ మీట్‌ పెట్టి.. ‘ఈ కారణంగానే మేం తెలుగు పేరు పెట్టలేదు’ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని పరిశీలించారో లేక మరో కారణమో కానీ ‘వార్‌ 2’ సినిమా పేరు కూడా మారుతోంది అని అంటున్నారు.

Jr NTR

హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) – తారక్‌ (Jr NTR) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్‌ – టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలతో తెరకెక్కి భారీ విజయం అందుకున్న ‘వార్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. ఈ సినిమా షూటింగ్‌ కొత్త షెడ్యూల్‌ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ విషయం బయటకు వచ్చింది అని చెబుతున్నారు. కొత్త పుకార్ల బట్టి చూస్తే.. ఈ సినిమా పేరును మారుస్తున్నారట.

అయితే మొత్తం పేరును మార్చకుండా.. ఇంగ్లిష్‌లో ఉన్న టైటిల్‌కు తెలుగు పేరును యాడ్‌ చేసి పెడుతున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమాకు ‘వార్‌ 2 – యుద్ధభూమి’ అని పెడతారు అని చెబుతున్నారు. నిజానికి ఈ పేరు ఇప్పుడు అనుకున్నది కాదు.. సినిమా ప్రారంభంలోనే అనుకున్నారు అని తెలుస్తోంది. ఈ క్రమంలో ‘వార్‌ 2’ సినిమా ప్రారంభించిన కొత్త రోజుల్లో హృతిక్‌ ఓ ట్వీటులో ‘యుద్ధ భూమి’ అని ప్రస్తావించాడు.

వచ్చే ఏడాది ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్‌ చేస్తారు అని చెబుతున్న సినిమాను శరవేగంగా పూర్తి చేయాలని టీమ్‌ ప్లాన్‌ చేస్తోందట. నవంబరులో మొదలయ్యే షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారట. ఈ సినిమాకు షూటింగ్‌ ఎంత కాలం పడుతుందో.. పోస్ట్‌ ప్రొడక్షన్‌కి కూడా అంతే సమయం పడుతుంది అని అంటున్నారు. మరి ‘వార్‌ 2’.. యుద్ధ భూమిలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus