Tripti Dimri: ప్రభాస్‌ సినిమాలో ‘యానిమల్‌’ బ్యూటీ… క్లారిటీ ఇచ్చేసింది!

  • December 11, 2023 / 04:07 PM IST

త్రిప్తి దిమ్రి… ఇప్పుడు ఈమె గురించి చర్చించుకోని నెటిజన్‌ లేడు అంటే అతిశయోక్తి కాదు. ‘యానిమల్‌’ సినిమాలో ఆమెను, ఆమెతో రణ్‌బీర్‌ చేసిన ఇంటిమేట్‌ సీన్‌ను చూసిన తర్వాత కుర్రకారు ఫిదా అయిపోయారు. అంతలా ఆకట్టుకుంది. దీంతో ఆమె నెక్స్ట్‌ సినిమా ఏంటి అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో మొన్నీమధ్య ఓ స్టార్ హీరో సినిమా పేరు వినిపించగా… ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌ పేరు వినిపిస్తోంది. ఈ విషయంలో తాజాగా స్పష్టత కూడా వచ్చేసింది.

‘యానిమల్‌’ సినిమా తీసిన సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం ఆ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేసే పనిలో ఉన్నారు. త్వరలో తన నెక్స్ట్ సినిమా ‘స్పిరిట్‌’ను స్టార్ట్‌ చేస్తారు. సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చాలా ఉందని, వచ్చే ఏడాది ఆఖరులో సినిమా షూటింగ్‌ మొదలవుతుంది అని ఇప్పటికే చెప్పేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రిని తీసుకుంటున్నారని, లేదంటే ఓ స్పెషల్‌ క్యారెక్టర్ కోసం తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.

అయితే ఈ పుకార్లపై త్రిప్తి (Tripti Dimri) క్లారిటీ ఇచ్చిందని టాక్. ఆమె సన్నిహితుల సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. అయితే ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ కాలేదు కాబట్టి ఇప్పుడు కాస్టింగ్‌ వివరాలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేం. ఏమో సినిమా మొదలయ్యాక ఆమె ప్రాజెక్టులో పార్ట్ కావొచ్చు అని అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. అన్నట్లు ఆమె రవితేజ కొత్త సినిమాలో హీరోయిన్‌ అవుతుంది అంటూ ఈ మధ్య పుకార్లు వచ్చాయి.

రవితేజ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అని కూడా అన్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలోనే హీరోయిన్‌ను కూడా చెప్పేస్తారు అని లేటెస్ట్‌ టాక్‌. ఆ నాయికే త్రిప్తి దిమ్రి అని చెబుతున్నారు. ఇప్పటికే టీమ్‌ ఈ విషయంలో ఆమె సంప్రదించిందట. ఆమె కూడా సానుకూలంగా సమాధానం ఇచ్చిందని భోగట్టా.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus