టాలీవుడ్లో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో పారితోషికం తీసుకునే దర్శకుల్లో త్రివిక్రమ్ ఉంటాడు. ఇతని దర్శకత్వంలో సినిమా చేయాలని ఆశపడని హీరో ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. ఇక త్రివిక్రమ్ కూడా ఓ పక్క దర్శకుడిగానే కాకుండా పక్క హీరోల సినిమాలకు రైటర్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు.ఇందుకు అతనికున్న స్టార్ ఇమేజ్ కూడా ఉపయోగపడుతుంది.ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్.
మరోపక్క పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ మూవీకి కూడా సంభాషణలు అందిస్తున్నాడు.ఇక్కడితో అయిపోలేదు ఆయనకి థియేటర్ల బిజినెస్ కూడా ఉందనేది లేటెస్ట్ టాక్. అతని సినిమాలనే కాకుండా అతని సన్నిహితుల సినిమాల కోసం కూడా ఈ థియేటర్స్ ను కేటాయిస్తూ ఉంటారట త్రివిక్రమ్. సంక్రాంతికి అలాంటి టైములో త్రివిక్రమ్ థియేటర్లను అలా ఉపయోగిస్తారన్న మాట. అంతేకాకుండా నిర్మాతగా కూడా మారి ఆయన సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు.
ఇప్పటికే అతని స్నేహితుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాని నిర్మించారు. అలాగే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థతో కలిసి నిర్మించే సినిమాల్లో ఈయన భాగస్వామిగా వ్యవహరిస్తారు అనే టాక్ ఎప్పటినుండో ఉంది. త్వరలో అధికారికంగా భాగస్వామి కాబోతున్నాడని తెలుస్తుంది. అతను భాగస్వామిగా వ్యవహరించే సినిమాలకి అతను డైలాగ్స్, స్క్రీన్ ప్లే వంటి విభాగాలకు పనిచేస్తున్నందుకు ప్రత్యేకంగా పారితోషికం తీసుకుంటాడని తెలుస్తుంది.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!