‘అన్‌స్టాపబుల్ 2’ కూడా అదే దారిలో నడుస్తుందంటున్న నెటిజన్లు

ఓటీటీ టాక్‌ షోల్లో ‘అన్‌స్టాపబుల్‌’ క్రేజ్‌ ఓ లెవల్‌ అని చెప్పాలి. స్టార్‌ హీరో హోస్ట్‌ కావడం, షోకి వచ్చేవాళ్లూ స్టార్‌ హీరోలు కావడంతో షోకి బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో టీమ్‌ రెండో సీజన్‌ను స్టార్ట్‌ చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ‘అన్‌స్టాపబుల్‌ 2’ మొదలవుతుంది. తొలి ఎపిసోడ్‌ 14వ తేదీన స్ట్రీమ్‌ అవుతుంది. ఇదంతా ఓకే. ఇక్కడే సోషల్‌ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. తొలి సీజన్‌లాగే.. రెండో సీజన్‌ కూడా మచ్చలు చెరిపేసే కార్యక్రమమేనా అని అంటున్నారు.

అదేంటి.. మచ్చలు చెరిపేయడం అనుకుంటున్నారా? ‘అన్‌స్టాపబుల్‌’ తొలి సీజన్‌ చూస్తే.. అందులో చాలావరకు కొత్త బాలకృష్ణను చూశాం. కోపంగా ఉంటారు, అగ్రెసివ్‌గా ఉంటారు అని బాలయ్య మీద ఉన్న చెడ్డ పేరును చెరిపేసింది ఆ కార్యక్రమం. అయితే పనిలో పనిగా బాలకృష్ణ చేసే సేవా కార్యక్రమాలు గురించి చెప్పుకొచ్చారు. కుర్ర హీరోలను పిలుచుకొచ్చి మీరు ఎందుకు స్టార్‌ అయ్యారు అంటూ కొన్ని మాటలు వినిపించారు. అవి వారి మనసుల్లోంచి వచ్చి ఉంటే.. గతంలో చాలా సందర్భాల్లో బయట స్టేజీల మీదే వచ్చేవి కదా అనేది అభిమానుల ప్రశ్న.

వీటితోపాటు మరో పని కూడా జరిగిపోయింది. ఇండస్ట్రీలో బాలయ్యతో వైరం ఉంది అంటూ వినిపించిన, కనిపించిన హీరోలను షోకి పిలిచి మా మధ్య ఏమీ లేదు అని చెప్పకనే చెప్పించారు. అయితే ఈ సీజన్‌లో బాలయ్య సహోద్యాయ నటులు ఎవరూ రాలేదు. అంతా బాలయ్య తర్వాతి తరం వారే. దీంతో అప్పుడు జరిగినవి బయటకు రాలేదు. అలాగే టీడీపీ నుండి ఎన్టీఆర్‌ను దూరం పెట్టిన విషయంలో కూడా ‘అది తప్పనిసరి నిర్ణయం’ అనేట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బాలయ్య సొంత సినిమా ప్రమోషన్లు, అల్లు అర్జున్‌ సినిమా ప్రమోషన్లు కూడా అయిపోయాయి. ఇవి అందరూ చూసినవే.

ఇక కొత్త సీజన్‌లో ఏముంటుందా అంటే తొలి ఎపిసోడ్‌ నుండే మచ్చలు మాయం కాన్సెప్ట్‌ మొదలైంది. ‘బిగ్‌ డెసిషన్‌ 1995’ అంటూ చంద్రబాబు నాయుడుతో అప్పటి విషయంపై క్లారిటీ ఇప్పించారు. మంగళగిరిలో నారా లోకేశ్‌ ఓడిపోవడం, స్విమ్మింగ్‌ పూల్‌లో ఫొటోలు లాంటి వాటిపై క్లారిటీ ఇచ్చేలా ఎపిసోడ్‌ డిజైన్‌ చేశారు అంటూ జోకులు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. తొలి ఎపిసోడ్‌తోనే ఈ సీజన్‌ను ఒక గాటన కట్టలేం కానీ.. ఇందులోనూ అలానే ఉంటుందేమో అని నెటిజన్ల చర్చ. చూద్దాం మరి ఏమవుతుందో?

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus