పూరిని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇన్స్టా గ్రామర్..?
- June 8, 2019 / 12:40 PM ISTByFilmy Focus
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది. ఊర మాస్ డైలాగ్స్ తో, డిఫరెంట్ లుక్ తో రామ్ సరికొత్తగా కనిపిస్తుండడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. జులైలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
- కైలాసపురం వెబ్ సిరీస్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- కిల్లర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- హిప్పీ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- సెవెన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఇదిలా ఉండగా.. ఈ చిత్రం స్క్రిప్ట్ ని తన అనుమతి లేకుండా బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళీ కృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో లీక్ చేశాడని దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. వెంటనే దాని డిలీట్ చేయాలని కోరినప్పటికీ.. అయన భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నాడని పూరి పోలీసులకు కంప్లైంట్ చేసారు. వెంటనే ఈ విషయం పై చర్య తీసుకుంటామని పోలీసులు పూరికి హామీ ఇచ్చారట. అసలే హిట్లు లేక ప్లాపులతో సతమతమవుతున్న పూరికి ఇలా జరగడం విషాదకరమనే చెప్పాలి.
















