జూలై 12న `ఇస్మార్ట్ శంకర్` విడుదల
- May 27, 2019 / 12:09 PM ISTByFilmy Focus
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తొలిసారి రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్ హైదరబాదీ` ట్యాగ్ లైన్. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ఔట్ స్టాండ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. టైటిల్ రోల్‌లో నటించిన రామ్ టెరిఫిక్ షో చేశాడని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.
- సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేస్తున్నారు. మూడు పాటల చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ పాటలను హైదరాబాద్‌లో భారీ సెట్స్ వేసి చిత్రీకరించబోతున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.











