పాన్ ఇండియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఏ.ఆర్.రెహమాన్ (A R Rahman)అందరికీ సుపరిచితమే. ఆయన మ్యూజిక్ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఆయన విడాకుల వార్తలతో చర్చల్లో నిలిచారు. తర్వాత ఆయన ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఇందులో ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఏ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ.. “1985 – 1986 .. టైములో నా జీవితంలో జరిగిన సంఘటన నాలో చాలా మార్పుని తీసుకొచ్చింది.
A R Rahman
దాని వల్ల మ్యూజిక్ విషయంలో నా (AR Rahman) స్టైల్ మారింది. విషయం ఏంటంటే.. అప్పట్లో ఓ గిటారిస్ట్ ఫుల్లుగా తాగేసి వచ్చి… నా మ్యూజిక్ గురించి ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేశాడు. నువ్వు సినిమాలకి సంగీత దర్శకుడిగా పని చేస్తావా? అసలు నీకు మ్యూజిక్ ప్లే చేయడం వచ్చా.? అంటూ నా మ్యూజిక్ స్కిల్స్ గురించి ప్రశ్నించడమే కాకుండా.. ఇష్టమొచ్చిన దారుణమైన కామెంట్స్ చేశాడు. అవి నన్ను ఎంతో బాధించాయి. చాలా చీప్ గా అనిపించాయి.
తర్వాత పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెట్టాను. అతని మాటలని నేను అర్థం చేసుకున్నాను. కానీ అందుకు వారం రోజులు టైం పట్టింది. నేను పనిచేసే కంపోజర్ల ప్రభావం నాపై కచ్చితంగా ఉంటుంది.. అందుకు నేను ప్రిపేర్ అయ్యి ఉండాలి అని తెలుసుకున్నాను. నా మ్యూజిక్ స్టైల్ మార్చుకున్నాను.
కాకపోతే అతని మాటల వల్ల నాకు కలిగిన బాధ నుండి బయటపడటానికి రూ.7 ఏళ్ళు టైం పట్టింది” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. పోటీ ప్రపంచంలో ఆశించిన ఫలితాలు అందుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈ క్రమంలో కొంతమంది నుండి అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వాటిని ఎలా జయించాలి అనేది.. రెహమాన్ (AR Rahman) చెప్పిన ఈ విషయాలని బట్టి అర్ధం చేసుకోవచ్చు.