ఒక్క డైలాగ్ తో రాత్రికి రాత్రి ఫ్యాన్ బేస్ పెంచేసుకున్నాడు

తెలుగులో కంటే తమిళనాట ఫ్యాన్ వార్ రచ్చ ఎక్కువే అనే విషయం తెలిసిందే. మన తెలుగు సినిమా అభిమానులు ఇంకా కలెక్షన్స్ విషయంలో కొట్టుకుచస్తుంటే.. తమిళ స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం ట్విట్టర్ ట్రెండ్స్ దాకా వెళ్ళిపోయారు. హీరోలు సైతం వాళ్ళు చేసే ట్రెండ్స్ చూసి తలలు బాదుకోవడం తప్ప చేసేదేమీలేక బాధపడుతుంటారు. అయితే.. చాలా అరుదుగా మాత్రమే తమిళ స్టార్ హీరోలు తమ స్థాయి నటులను ప్రస్తావిస్తారు. నిన్న “మాస్టర్” ఆడియో లాంచ్ వేడుకలో ఇదే జరిగింది.

తమిళ సూపర్ స్టార్ విజయ్ నిన్న తన రెగ్యులర్ స్టైల్ కి బదులుగా సూట్ వేసుకొని ఈవెంట్ కి వచ్చాడు. ఉన్నట్లుండి ఈ మార్పేమిటి? అని యాంకర్ ప్రశ్నించగా.. “అజిత్ లాగ నీట్ గా రెడీ అవ్వాలనుకున్నాను” అంటూ సమాధానమిచ్చేసరికి ఆడిటోరియం మొత్తం మార్మోగిపోయింది. ఒక్క డైలాగ్ తో విజయ్ తనకు అప్పటివరకూ యాంటీగా ఉన్న అజిత్ ఫ్యాన్స్ అందర్నీ తనవైకుపు తిప్పేసుకున్నాడు. దాంతో విజయ్ & అజిత్ ఫ్యాన్స్ నడుమ ఫ్యాన్స్ వార్ కి ప్రస్తుతం కళ్ళెం పడినట్లే. ఇకపోతే.. విజయ్ మాస్టర్ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. మరి కరోనా కారణంగా ఆ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక నిన్న విజయ్ సేతుపటికి విజయ్ ముద్దు పెట్టడం కూడా “మాస్టర్” వేడుకకు ఒన్నాఫ్ ది హైలైట్ అని చెప్పొచ్చు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus