Jaabilamma Neeku Antha Kopama Collections: పర్వాలేదు…కానీ ఈ మాత్రం సరిపోవు..!
- February 24, 2025 / 04:00 PM ISTByPhani Kumar
గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబ్బింగ్ సినిమాల్లో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (Jaabilamma Neeku Antha Kopama) మంచి టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) దర్శకత్వం వహించిన సినిమా ఇది. అతని సోదరి కుమారుడు పవిష్ ఈ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. ‘గోల్డెన్ స్పారో’ అనే పాట రిలీజ్ కి ముందు బాగా వైరల్ అయ్యింది. అది సినిమా పబ్లిసిటీకి పనికొచ్చింది అని చెప్పాలి. జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) దీనికి సంగీతం అందించారు.
Jaabilamma Neeku Antha Kopama Collections:

తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి’ సంస్థ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అంతంతమాత్రమే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.32 cr |
| సీడెడ్ | 0.12 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.24 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.68 cr |
‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.8 కోట్లు. అయితే 3 రోజుల్లో ఈ సినిమా రూ.0.68 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.1.12 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. చిత్ర బృందం కొంచెం బెటర్ గా ప్రమోట్ చేసి ఉంటే కచ్చితంగా కొంచెం ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చేవేమో.












