శర్వానంద్, సమంత.. ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘జాను’. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన ’96’ చిత్రానికి ఇది రీమేక్ . సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ఒరిజినల్ ను తెరకెక్కించిన సి.ప్రేమ్ కుమారే డైరెక్ట్ చేసాడు. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మౌత్ టాక్ తో పాటు మంచి రివ్యూలను కూడా సంపాదించుకుంది. మొదటి 3 రోజులు కలెక్షన్లు పర్వాలేదనిపించినా 4 వ రోజు నుండీ మాత్రం దారుణంగా పడిపోయాయి.
ఇక ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
2.68 cr
సీడెడ్
0.84 cr
ఉత్తరాంధ్ర
1.12 cr
ఈస్ట్
0.45 cr
వెస్ట్
0.34 cr
కృష్ణా
0.46 cr
గుంటూరు
0.56 cr
నెల్లూరు
0.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.42 cr
ఓవర్సీస్
0.84 cr
వరల్డ్ వైడ్ టోటల్
7.92 cr (share)
‘జాను’ చిత్రానికి 21 కోట్ల బిజినెస్ జరిగింది. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం 7.92 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 13.08 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ‘జాను’ కంటే సంక్రాంతి సినిమాలకే కాస్త కలెక్షన్లు వస్తుండడం గమనార్హం. ఈరోజు నుండీ విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం విడుదలయ్యింది. ఆ చిత్రానికి టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ వీకెండ్ మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ వీకెండ్ కు ఆ చిత్రం ఎఫెక్ట్ ‘జాను’ పై పడినట్టయ్యింది. లేకపోతే కనీసం 10 కోట్ల షేర్ వరకూ కలెక్ట్ చేసేదేమో..!