శర్వానంద్, సమంత.. ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘జాను’. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టిన ’96’ చిత్రానికి ఇది రీమేక్ . సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ రీమేక్ ను ఏరి కోరి చేయించాడు. మంచి రివ్యూ వచ్చాయి.. సమంత, శర్వానంద్ ల పెర్ఫార్మన్స్ లకు మంచి స్పందన లభించింది. కానీ ఈ చిత్రం కొన్న డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాల్ని మిగిల్చాయి. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసింది.
ఇక ఈ చిత్రం ఫైనల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 2.89 cr |
సీడెడ్ | 0.89 cr |
ఉత్తరాంధ్ర | 1.19 cr |
ఈస్ట్ | 0.49 cr |
వెస్ట్ | 0.38 cr |
కృష్ణా | 0.52 cr |
గుంటూరు | 0.62 cr |
నెల్లూరు | 0.23 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.45 cr |
ఓవర్సీస్ | 0.88 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 8.54 cr (share) |
‘జాను’ చిత్రానికి 21 కోట్ల బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 8.54 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం 12.46 కోట్ల నష్టాల్ని మిగిల్చింది. అంటే డబుల్ డిజాస్టర్ కంటే ఎక్కువే. ఈ మధ్యకాలంలో సమంతకి ఈ చిత్రమే పెద్ద ప్లాప్ అని చెప్పాలి. ఇక శర్వానంద్ కు ఇది వరుసగా 3వ డిజాస్టర్. ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ఇప్పుడు ‘జాను’. మరి తరువాతి సినిమాతో అయినా హిట్టు కొడతాడేమో చూడాలి.
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!