‘జబర్దస్త్’ స్టార్టింగ్ లో అబ్బాయిలు.. అమ్మాయిల గెటప్ లు వేసేవారు. అందుకు కారణం ఎక్కువగా వారిని కొడుతున్నట్టు, తన్నుతున్నట్టు, డబుల్ మీనింగ్ డైలాగులు వంటివి భాగం కావడం వల్ల.అమ్మాయిలు అలాంటి వాటిని స్టేజ్ పై ఫ్రీగా చేయలేరు.అందుకే అమ్మాయిలను ఆ షోకి దూరంగా ఉంచేవారు. డైరెక్టర్స్ కూడా అమ్మాయిలను తీసుకునేందుకు ఒప్పుకునే వారు కాదు. అయితే చంద్ర ఏం మ్యాజిక్ చేశాడో తెలీదు కానీ తన టీం లోకి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు.
ఆమె పేరు సత్య శ్రీ. ‘రాజా ది గ్రేట్’ ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది.కొన్నాళ్ళకు ‘అదిరింది’ షోకి చమ్మక్ చంద్ర జంప్ అయితే సత్య శ్రీ కూడా షోలో స్కిట్లు చేసింది. అయితే ‘జబర్దస్త్’ కు ఈమె ఎందుకు గుడ్ బై చెప్పినట్టు అనే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది సత్య శ్రీ. ఆమె మాట్లాడుతూ.. ” ‘జబర్దస్త్’ విషయంలో నేను చమ్మక్ చంద్ర గారిని గురువుగా భావిస్తుంటాను.
ఆయన జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతో..నేను నాతో పాటు మా టీమ్ కూడా గురువు వెంట ఉండాలనే ఉద్దేశంతో బయటికి వచ్చేసాం. మా గురువు గారితో పాటే మేము అనుకున్నాం.. వచ్చేశాం” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ‘చమ్మక్ చంద్ర వల్లే తాను ఈరోజు ఇలా ఉన్నాను.. నిలబడగలిగాను అని.. ఆయన మాకు ఎంతో సాయం చేశారని’ ఆమె తెలియజేసింది. అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల గురించి కూడా వివరించింది.
అంతేకాకుండా తాను పవన్ కళ్యాణ్ అభిమాని అని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో కూడా నటించాను అని.. ఆ సినిమాలో ఓ సాంగ్లో నేను చెయ్యను అని చెప్పాను ..! ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఎవరో చెప్పారు. కానీ ఆయన నన్ను ఏమీ అనలేదు. ‘మంచి ఆర్టిస్ట్ అవ్వు గాడ్ బ్లెస్ యు’ అంటూ ఓ నవ్వు నవ్వారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.