బుల్లితెర స్టార్ కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు కాగా హైపర్ ఆది (Hyper Aadi) రెమ్యునరేషన్ చాలామంది కమెడియన్లతో పోలిస్తే ఎక్కువనే సంగతి తెలిసింది. హైపర్ ఆది కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వస్తున్నా హైపర్ ఆది మాత్రం ఈటీవీ ఛానల్ లోని షోలు, ఈవెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని సినిమాలలో కమెడియన్ రోల్స్ లో కనిపిస్తూ తన కామెడీ టైమింగ్ తో ఆది ఆకట్టుకుంటున్నారు.
అయితే ఆది జబర్దస్త్ లో సక్సెస్ కావడానికి అదిరే అభి కారణమనే సంగతి తెలిసిందే. అదిరే అభి తన టీంలో ఛాన్స్ ఇవ్వడంతో హైపర్ ఆది వచ్చిన అవకాశాన్ని ప్రూవ్ చేసుకుని కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగారు. యూట్యూబ్ లో హైపర్ ఆది స్కిట్లకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్ రాము పాండురంగడు (Pandurangadu) సినిమాలోని సాంగ్ కు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు.
ఆ పర్ఫామెన్స్ తర్వాత హైపర్ ఆది మాట్లాడుతూ అభి అన్న నా అవసరం తీరిస్తే రాము అన్న నా ఆకలి తీర్చాడని అదైతే నాకు బాగా గుర్తున్న క్షణాలు అని ఆది కామెంట్లు చేశారు. ఈ నెల 31వ తేదీన శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. రాము ప్రతిభకు తగ్గ అవకాశాలు వస్తే కెరీర్ పరంగా మరింత ఎదుగుతాడని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
హైపర్ ఆది , కమెడియన్ రాము రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. హైపర్ ఆది కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.