Kevvu Karthik: తన రెమ్యునరేషన్ ఎంతో చెప్పేసిన కెవ్వు కార్తీక్..?

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ను యూత్ ఎక్కువగా అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లకు సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వస్తున్నాయి. కమెడియన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలని అనుకునే వాళ్లకు జబర్దస్త్ మంచి ఫ్లాట్ ఫామ్ అని చెప్పవచ్చు. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో కెవ్వు కార్తీక్ ఒకరు. టీమ్ మెంబర్ గా ఎంట్రీ ఇచ్చిన కెవ్వు కార్తీక్ టీమ్ లీడర్ స్థాయికి ఎదిగారు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కెవ్వు కార్తీక్ ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవినాష్ తో కలిసి స్కిట్లు చేసిన కెవ్వు కార్తీక్ కు అవినాష్ బిగ్ బాస్ షోకు వెళ్లడంతో అదృష్టం కలిసొచ్చింది. సొంతంగా స్క్రిప్ట్ రాసే టాలెంట్ కూడా ఉండటంతో కెవ్వు కార్తీక్ టీమ్ లీడర్ గా ఎదిగారు. తాను మొదట్లో 200 రూపాయలకు మిమిక్రీ చేసేవాడినని ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఈవెంట్లు చేయడం మొదలుపెట్టానని కార్తీక్ చెప్పారు.

వరంగల్ లో చేసిన ఒక ఈవెంట్ వల్ల తనకు క్రేజ్ పెరిగి జాతకమే మారిపోయిందని జబర్దస్త్ షోలోకి వచ్చిన తరువాత ఆ షోకే పరిమితమయ్యానని కెవ్వు కార్తీక్ తెలిపారు. టీమ్ లీడర్ స్థాయికి ఎదిగిన తరువాత తన రెమ్యునరేషన్ లక్షల్లోకి చేరిందని కెవ్వు కార్తీక్ అన్నారు. కెవ్వు కార్తీక్ తన పారితోషికం ఎంతో స్పష్టంగా చెప్పకపోయినా తెలుస్తున్న సమాచారం ప్రకారం కెవ్వు కార్తీక్ రెమ్యునరేషన్ 2 లక్షలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. జబర్దస్త్ షో ద్వారా కొందరు కమెడియన్లు కోట్ల రూపాయలు సంపాదించారని సమాచారం.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus